పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. టీజర్ విడుదలపై అప్డేట్ ఇచ్చారు.  

నెలల వ్యవధిలో బ్రో మూవీ కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్. ఈ ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలు కాగా జులై 28న విడులవుతుంది. ఓ స్టార్ హీరో మూవీ ఇంత త్వరగా థియేటర్స్ లోకి రావడం ఊహించని పరిణామం. బ్రో తమిళ హిట్ మూవీ వినోదయ సితం రీమేక్. పవన్ మోడరన్ గాడ్ గా కనిపిస్తారు. సాయి ధరమ్ తేజ్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు. దర్శకుడు సముద్రఖని తెరకెక్కించారు. 

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బ్రో విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. మామా అల్లుళ్లు పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కూలీ గెటప్ వేసి మాస్ టచ్ ఇచ్చారు. ముఖ్యంగా పవన్ అవతార్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చింది. కెరీర్ బిగినింగ్ లో చేసిన తమ్ముడు చిత్రంలో పవన్ ఈ తరహా లుక్ ట్రై చేశారు. 

Scroll to load tweet…

ఇక టీజర్ ఎప్పుడనేది ప్రకటించలేదు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. పవన్ ఇమేజ్ కి తగ్గట్లు ఒరిజినల్ కథకు మార్పులు చేర్పులు చేశారు. త్రివిక్రమ్ ఆ బాధ్యత తీసుకున్నారు. గతంలో పవన్ చేసిన గోపాలం గోపాలం మూవీలో క్యారెక్టర్ ని ఇది పోలి ఉంటుందని సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.