Asianet News TeluguAsianet News Telugu

పవన్ కి లేని బాధ ఫ్యాన్స్ కి ఎందుకు?... ఫైనల్ గా నిజం ఒప్పుకున్నారు!


రీమేక్స్ మాకొద్దు బాబోయ్ అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏకరువు పెడుతున్నారు. వారి ఫ్రస్ట్రేషన్ సూసైడ్ నోట్స్ వరకూ వెళ్ళింది. 
 

hero pawan kalyan fans fed up with remakes are these two films reason
Author
First Published Dec 9, 2022, 6:59 PM IST


రచించిన వంటకం పదే పదే కోరుకుంటారు. వికటిస్తే మాత్రం దాని జోలికి వెళ్లరు. పరభాషా రెసిపీ అరువు తెచ్చుకొని పవన్ మార్క్ దినుసులు వేసి ఫ్యాన్స్ ముఖాన కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సెట్ కాని సినిమాలు ఎంచుకొని, కథకు ఏమాత్రం సరిపడని ఎలివేషన్స్, కమర్షియల్ అంశాలు జోడించి కిచిడి చేసి విడుదల చేస్తున్నారు. పాలలో నీళ్లు, పంచదార వేస్తే ఓకే... అసహజంగా నూనె, మసాలా వేస్తే ఎందుకూ పనికి రాకుండా పోతాయి. 

వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలకు కమర్షియల్ అంశాల పేరుతో స్వచ్ఛమైన పాల లాంటి కథకు కారం కలిపి ప్రేక్షకులకు వడ్డించారు. కోర్ట్ రూమ్ లో హీరో లా పాయింట్స్, సెక్షన్స్ తో గెలవాలి. జడ్జి ముందు బల్లలు ఇరగొట్టి, బిగ్గరగా అరవడమే హీరోయిజం అనుకునే లాజిక్ లేని సీన్స్ వకీల్ సాబ్ మూవీలో గొప్ప సన్నివేశాలు. ఊరు పేరు తెలియని నటులు చేస్తున్న వెబ్ సిరీస్లలో కోర్ట్ రూమ్ డ్రామాలు వాస్తవికతకు ఎంతో దగ్గరగా. లాజికల్ గా రాసుకుంటున్నారు. 

యాభై కోట్లు తీసుకునే ఒక స్టార్ హీరో సినిమా సిల్లీ సీన్స్ సమాహారంగా ఉంటుంది. ఇమేజ్ పేరుతో పింక్, అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రాలను ఖూనీ చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ చిత్రాల దర్శకులు ఈ రీమేక్స్ చూస్తే మాములుగా నవ్వుకోరు. ఇవి మా కథలేనా అని వాళ్లకు సందేహం కూడా రావచ్చు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ పవన్ ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదని తాజా పరిణామాలతో స్పష్టమైంది. ఇంకో రీమేక్ వద్దని వారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కారణం ఆ రెండు చిత్రాలే. 

థియేటర్స్ లో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు అభిమానుల మనసులను ఎంతగా మానభంగం చేశాయో వారి సోషల్ మీడియా కామెంట్స్ చూస్తే తెలుస్తుంది. అజ్ఞాతవాసి వంటి స్ట్రెయిట్ మూవీ అయినా పర్లేదు, రీమేక్ వద్దు. ఇప్పటికే పలుమార్లు చూసేసిన తేరి రీమేక్ అసలే వద్దంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు మైత్రి మేకర్స్ ని తిడుతూ నెగిటివ్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అసలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ హిట్ చిత్రాలుగా ఫ్యాన్స్ తో పాటు పరిశ్రమ చూడటం లేదు. ఆ రెండు చిత్రాల దర్శకుల ప్రస్తుత పరిస్థితి అందుకు నిలువెత్తు నిదర్శనం. 

హిట్ మూవీ దర్శకుడిని నిర్మాతలు వెంటాడతారు. పవన్ లాంటి స్టార్ హీరోతో సక్సెస్ ఫుల్ మూవీ చేస్తే ఇంటి ముందు క్యూ కడతారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాల దర్శకులైన వేణు శ్రీరామ్, సాగర్ కే చంద్రలను కనీసం దర్శకులుగా పరిశ్రమ చూడటం లేదు. లిటరల్ గా వారిని మర్చిపోయారు. నిజమైన ప్రతిభ చూపించిన చందూ మొండేటి, వశిస్థ్, హను రాఘవపూడి లాంటి దర్శకుల గురించి మాత్రం దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. వారికి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. 

ఈ రెండు చిత్రాల విషయంలో నిర్మాత, హీరో, దర్శకుడు అందరిలో కమర్షియల్ యాంగిల్ మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడా సినిమాపై ప్రేమ, సీరియస్ నెస్ ఉండదు. కంటెంట్ తో సంబంధం లేకుండా పవన్ సినిమాకు బిజినెస్ జరుగుతుంది. కాబట్టి నిర్మాత సేఫ్. తక్కువ రోజుల్లో పవన్ రెమ్యూనరేషన్ ఆయనకు వచ్చేస్తుంది. ఇక దర్శకులు అంటావా... వేణు శ్రీరామ్, సాగర్ కే చంద్ర పెద్దగా డిమాండ్ ఉన్న దర్శకులేమీ కాదు. కాబట్టి పవన్ ని డైరెక్ట్ చేశామని గుర్తింపు వస్తుంది. త్రివిక్రమ్ లాంటి వారు కొన్ని కోట్లు వెనకేసుకోవచ్చు. ఇక్కడ మోసపోతుంది కేవలం టికెట్ కొన్న ప్రేక్షకులు, నమ్మిన అభిమానులు మాత్రమే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios