స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దేహదారుడ్యం పెంచేందుకు ఎన్టీఆర్ సిద్ధం అవుతున్నాడట.
హీరో ఎన్టీఆర్ క్రేజీ లైనప్ కలిగి ఉన్నాడు. అందులో వార్ 2 ఒకటి. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించనున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనుంది. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. కాగా వార్ 2 కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా సిద్ధం కానున్నారట. ఆయన భారీగా కండలు పెంచనున్నాడట. మేకోవర్ సాధించేందుకు అమెరికా లేదా దుబాయ్ లో ఎన్టీఆర్ శిక్షణ ఉంటుందట. హృతిక్ రోషన్ కి పోటీ ఇచ్చేలా ఎన్టీఆర్ మేకోవర్ ఉంటుందని అంటున్నారు.
ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆర్ ఆర్ ఆర్ కోసం ఎన్టీఆర్ షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాధించాడు. వార్ 2 లో అంతకు మించి ఉంటుందని టాక్. ఎన్టీఆర్ చేస్తున్న మొదటి డైరెక్ట్ హిందీ చిత్రం వార్ 2. పార్ట్ 1లో హృతిక్-టైగర్ ష్రాఫ్ నటించారు. టైగర్ ష్రాఫ్ స్థానాన్ని ఎన్టీఆర్ తో రీప్లేస్ చేశారు. వార్ తో పోల్చుకుంటే వార్ 2 బడ్జెట్ భారీగా ఉండనుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. 2024 సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. వరుస షెడ్యూల్స్ తో శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా దేవర తెరకెక్కిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన సైఫ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. భైరవగా సైఫ్ అలీ ఖాన్ ని ఇంటెన్స్ లుక్ లో పరిచయం చేశారు.
ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ జతకట్టడం మరో అరుదైన విషయం. ఎన్టీఆర్, శ్రీదేవి వారసులు కలిసి నటించినట్లు అయ్యింది. అందుకే ఈ కాంబోకి క్రేజ్ ఏర్పడింది. జాన్వీ కపూర్ ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీగా దేవర నిలిచింది. దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
