Asianet News TeluguAsianet News Telugu

బాల్యంలో ఎన్టీఆర్ క్లాసిక్ డాన్స్ ఎంత గొప్పగా చేశాడో చూశారా... అరుదైన వీడియో వైరల్!

ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్. ఆయనకు అనేక కళల్లో ప్రావీణ్యం. ముఖ్యంగా ఆయన బెస్ట్ డాన్సర్. చిన్నప్పటి నుండి క్లాసిక్ డాన్స్ నేర్చుకుని ప్రదర్శనలు ఇచ్చారు. కాగా బాల్యంలో ఎన్టీఆర్ శాస్త్రీయ నృత్యం చేస్తున్న అరుదైన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. 
 

hero ntr childhood classical dance video getting viral ksr
Author
First Published Jun 27, 2024, 12:53 PM IST

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు.. ఎన్టీఆర్ బాల్యంలో అనేక విజయాలు సాధించారు. టీనేజ్ కూడా దాటకుండానే మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న ఏకైన నటుడు. ఎన్టీఆర్ ఏక సంధాగ్రాహి. డైలాగ్స్, డాన్స్ ఆయన ప్రాక్టీస్ చేయరట. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా సెట్స్ లో ఫస్ట్ టేక్ లో చేసే అరుదైన హీరో ఎన్టీఆర్. మంచి నటుడు, సింగర్... అంతకు మించిన డాన్సర్. దేశంలోనే గొప్ప డాన్సర్ గా ఆయనకు పేరుంది. 

ఇందుకు కారణం ఎన్టీఆర్ చిన్నప్పుడు భరతనాట్యం, కూచిపూడి వంటి క్లాసిక్ డాన్స్ నేర్చుకున్నాడు. ప్రొఫెషనల్ డాన్సర్ గా ప్రదర్శనలు ఇచ్చాడు. శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం ఆయన్ని తిరుగులేని డాన్సర్ గా నిలిపింది. మెరుపు వేగంతో ఎన్టీఆర్ వేసే స్టెప్స్ అందుకోవడం ఎవరికైనా కష్టమే. పలువురు స్టార్ కొరియోగ్రాఫర్స్ ఎన్టీఆర్ ని పొగిడారు. 

కాగా ఎన్టీఆర్ బాల్యంలో ఇచ్చిన ఓ నృత్య ప్రదర్శనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. శ్యామ్ సింగరాయ్ చిత్రంలో  సాయి పల్లవి చేసిన ఓ సాంగ్ మిక్స్ చేసి ఓల్డ్ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. ఇక ఎన్టీఆర్ నృత్య ప్రదర్శన అద్భుతంగా ఉంది. 1998లో డల్లాస్ లో ఆ ప్రదర్శన ఇచ్చినట్లు వీడియోకి వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ చిన్ననాటి నృత్య ప్రదర్శన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఏక కాలంలో రెండు చిత్రాలు పూర్తి చేస్తున్నాడు. ఆ మధ్య ముంబైలో వార్  వరుస షెడ్యూల్స్ జరిగాయి. ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అలాగే దేవర వాయువేగంతో పూర్తి చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios