నితిన్ పెళ్లైందా.. ఎప్పుడు ఎక్కడ?

First Published 5, Mar 2018, 1:51 PM IST
hero nithin gives clarity on marriage
Highlights
  • ట్విట్టర్ వేదికగా పెళ్లి పుకార్లకు పుల్ స్టాప్
  • పెళ్లి దుస్తులు శ్రీనివాస కల్యాణం చిత్రంలోనివని వెల్లడి
  • దిల్ రాజు నిర్మాణంలో నితిన్ కొత్త సినిమా శ్రీనివాస కల్యాణం

టాలీవుడ్ యువ హీరో నితిన్ తన పెళ్లి పుకార్లకు ట్విట్టర్ వేదికగా పుల్‌స్టాప్ పెట్టాడు. పెళ్లి దుస్తుల్లో నితిన్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అందరూ అతను పెళ్లికొడుకాయెనే అంటూ ప్రచారం మొదలుపెట్టేశారు. ఈ వార్త ఆ నోట ఈ నోట నానుతూ చివరికి నితిన్ చెవిన పడింది. దాంతో పుకార్లకు ముగింపు పలకకుంటే లాభం లేదనుకున్న ఈ యూత్ హీరో 'అబ్బే నాకు ఇప్పుడే పెళ్లేంటి? అవన్నీ పుకార్లే' అంటూ ట్వీట్ చేశాడు. 

పెళ్లి దుస్తుల్లో ఉన్న తన ఫొటోలపై అతను క్లారిటీ ఇచ్చాడు. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న తన తదుపరి చిత్రం 'శ్రీనివాస కల్యాణం'కి సంబంధించినవని అతను చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో అతనికి జోడీగా అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా నటిస్తోంది. ఆదివారం ప్రారంభమయిన ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

loader