యంగ్ హీరో నితిన్ గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకులని పలకరించాడు. రంగ్ దే, చెక్, మ్యాస్ట్రో చిత్రాలు గత ఏడాది విడుదలయ్యాయి. వీటిలో రంగ్ దే, మ్యాస్ట్రో చిత్రాలు పర్వాలేదనిపించగా.. చెక్ నిరాశ పరిచింది. 

యంగ్ హీరో నితిన్ గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకులని పలకరించాడు. రంగ్ దే, చెక్, మ్యాస్ట్రో చిత్రాలు గత ఏడాది విడుదలయ్యాయి. వీటిలో రంగ్ దే, మ్యాస్ట్రో చిత్రాలు పర్వాలేదనిపించగా.. చెక్ నిరాశ పరిచింది. నితిన్ సాలిడ్ హిట్ అందుకుని చాలా కాలమే అవుతోంది. దీనితో నితిన్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. 

ప్రస్తుతం నితిన్ నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు చిత్రీకరించిన భాగం అవుట్ పుట్ అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో మాచర్ల నియోజకవర్గం మూవీపై చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారట. ఈ చిత్ర కథకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ లీక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ చిత్ర కథ మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలంని పోలి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. టైటిల్ కు తగ్గట్లుగానే దర్శకుడు శేఖర్ ఈ చిత్ర కథని పొలిటికల్ యాంగిల్ లో రెడీ చేసుకున్నారట. రంగస్థలం చిత్రంలో ప్రధాన అంశం విలేజ్ పాలిటిక్స్. దశాబ్దాలుగా ఆ ఊరికి ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తికీ ఓ యువకుడు ఎదురు నిలుస్తాడు. 

మాచర్ల నియోజకవర్గం చిత్ర కథలోని పాయింట్ కూడా అదే అట. మాచర్ల నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఎప్పుడూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే వ్యక్తిని నితిన్ అడ్డు పడతాడట. దీనితో కథ ఎలాంటి మలుపు తిరిగింది అనేది మిగిలిన కథ. ఈ చిత్రంలో నితిన్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నితిన్ లుక్ కూడా రఫ్ గా ఉంటుందట. నితిన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

నితిన్ కి జోడిగా ఈ చిత్రంలో కృతి శెట్టి నటిస్తోంది. అలాగే కేథరిన్ కూడా మరో హీరోయిన్ ఆ నటిస్తోంది. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాత.