కేఏ పాల్ ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ పేరు బాగానే ఫేమస్. రీసెంట్ గా జరిగిన ఏపీ ఎన్నికల్లో కేఏ పాల్ లేకుండా కామెడీ మిస్ అయ్యి ఉండేవాళ్లమని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అంతగా తన కామెంట్స్, స్టేట్మెంట్స్, ఇంటర్వ్యూలు, విచిత్ర ప్రవర్తనతో అందరినీ నవ్వించాడు.

మీడియా వారు కూడా కేఏ పాల్ ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డారు. సోషల్ మీడియాలో అతడి వీడియోలకు అంత క్రేజ్ ఉంది మరి. ఇప్పుడు ఓ యంగ్ హీరో కూడా పాల్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిసింది.

అతడే నిఖిల్. ఇప్పుడు నిఖిల్ కి ఏమైందని పాల్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తున్నాడని అనుకుంటున్నారా..? అసలు విషయంలోకి వస్తే నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. సినిమా పోస్టర్లు, టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు నిఖిల్.

ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించబోతున్నాడు. వారి పని ఇంటర్వ్యూలు చేయడమే కదా.. అందుకే ఇప్పుడు నిఖిల్ తన సినిమా ప్రమోషన్స్ కోసం పాల్ ని వాడుకుందామని చూస్తున్నాడు. అతడిని ఇంటర్వ్యూ చేయడం కోసం అప్పాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాడట. అలా సోషల్ మీడియాలో సినిమాపై బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతానికి పాల్ అమెరికాలో ఉన్నాడు. మరి నిఖిల్ కి పాల్ ఇంటర్వ్యూ దొరుకుతుందో లేదో చూడాలి!