Asianet News TeluguAsianet News Telugu

బిగ్ అప్ డేట్ ఇచ్చిన హీరో నిఖిల్ సిద్థార్ధ్, కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఆ పనిచేసిన యంగ్ హీరో.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిధార్థ్ మంచి స్పీడు మీద ఉన్నాడు. వరుసగా సినిమాలు రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఒక్కో పనిని పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ2 మూవీ హడావిడిలో ఉన్నాడు. ఈమూవీ నుంచి ఓ  బిగ్ అప్ డేట్ ను అందరితో పంచుకున్నాడు. 

Hero Nikhil Siddhartha Karthikeya 2 Hindi Dubbing
Author
Hyderabad, First Published Jun 30, 2022, 6:10 PM IST


నిఖిల్ వ‌రుస సినిమాల‌తో జోరుమీదున్నాడు. ఒకదాని వెంట మరొకటి రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నాడు. అసలే కరోనా పాండమిక్ టైమ్ వల్ల నిఖిల్ తన సినిమాల విషయంలో చాలా లాస్ అయ్యాడు. ఆతరువాత తన పెళ్ళి.. తరువాత రీసెంట్ గా నిఖిల్ తండ్రి చనిపోవడం.. ఇలా వరుసగా ఏదో ఒక హడావిడి నిఖిల్ ను తన సినిమాలపై కాన్సంట్రేట్ చేసుకోనీయకుండా చేశాయి. ఇక  అర్జున్ సుర‌వ‌రం త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు ఈ య‌ంగ్ హీరో  నుంచి మ‌రో సినిమా రాలేదు. ఈ మూడేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు నిఖిల్ వ‌రుస‌గా సినిమాల‌ను ఒప్పుకుంటున్నాడు. 

ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో కార్తికేయ-2 ఒక‌టి. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నిఖిల్ గతంలో నటించిన  కార్తికేయ సినిమాకు  సీక్వెల్‌గా తెర‌కెక్కింది. అయితే ఈ సీక్వెల్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచీ ఏదో ఒక ఇబ్బంది ఫేస్ చేస్తూనే ఉన్నాడు నిఖిల్. ఎప్పుడో  2014లో వ‌చ్చిన‌ కార్తికేయ సూపర్ సక్సెస్ సాధించింది. అప్పట్లో దాదాపు 6 కోట్ల‌తో నిర్మిత‌మైన ఈ సినిమా 20 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్లు సాధించింది.

ఇక అప్పటి నుంచీ దాదాపు 8 ఏళ్ళ త‌ర్వాత ఈ సినిమాకు  సీక్వెల్ తెర‌కెక్కింది. అయితే గతంలో మాధిరిగానే కార్తికేయ సినిమాల ఇది కూడా సూపర్ హిట్ అవ్వాలని జాగ్రత్తగా అన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్. అందులో భాగంగానే ప్రమోషన్ ఈవెంట్స్ తో పాటు టీజర్స్, ట్రైలర్స్, పోస్టర్స్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన  టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న కూడా వ‌చ్చింది.

ఇక ఈ సారి పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నాడు నిఖిల్. ఈ కార్తికేయ-2  సినిమాను తెలుగుతో పాటు, హిందీ, మ‌ల‌యాళం, త‌మిళ్, క‌న్న‌డ భాష‌ల్లో  కూడా రిలీజ్ చేయబోతున్నాడు. అందులో భాగంగా..  నిఖిల్ తాజాగా కార్తికేయ‌-2 హిందీ వెర్ష‌న్‌కు డ‌బ్బింగ్ చెబుతున్న‌ట్లు ట్విట్ట‌ర్‌లో ఫోటోను షేర్ చేశాడు. నిఖిల్ హిందీలో స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పడంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నిఖల్ జోడీగా మలయాళ ముద్దు గుమ్మ  అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ నటించింది.  ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. థ్రిల్ల‌ర్ ఫాంట‌సీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన  కార్తికేయా 2 జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios