టాక్, కలెక్షన్స్ తో సంబంధం లేకుండా... మా మూవీ బంపర్ హిట్ అంటున్నారు హీరో నిఖిల్. 18 పేజెస్ మూవీ పూర్ ఓపెనింగ్స్ దక్కించుకున్న నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి.  

కార్తికేయ 2 మూవీ పాన్ ఇండియా హిట్. బాలీవుడ్ పెద్దలు సైతం మెచ్చిన కార్తికేయ 2 ఈ ఏడాది విడుదలైన సంచలన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాభాలు పంచింది. అంత పెద్ద హిట్ మూవీ తర్వాత నిఖిల్ నుండి వస్తున్న 18 పేజెస్ పై సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ కథ అందించడం, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ కావడం ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. 

డిసెంబర్ 23న విడుదలైన 18 పేజెస్ డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా బాగోలేదన్న వారు అతి కొద్ది మంది మాత్రమే. మెజారిటీ ఆడియన్స్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే టాక్ కి తగ్గట్లు కలెక్షన్స్ లేవు. దారుణంగా డే వన్ 18 పేజెస్ రూ.1.75 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. రూ. 12 కోట్ల బిజినెస్ చేసిన 18 పేజెస్ ఓపెనింగ్ రోజు 20-30% కూడా రికవరీ చేయలేదు. 

View post on Instagram

ఈ క్రమంలో 18 పేజెస్(18 Pages) మూవీ బ్రేక్ ఈవెన్ కావడం కష్టం అన్న మాట వినిపిస్తోంది. ట్రేడ్ వర్గాల లెక్కలకు నిఖిల్(Nikhil) తనదైన సమాధానం చెప్పారు. 18 పేజెస్ మూవీ బడ్జెట్ 14 కోట్లు. నాన్ థియేట్రికల్ హక్కులు రూ. 22 కోట్లకు అమ్మారు. థియేట్రికల్ బిజినెస్ తో సంబంధం లేకుండా రూ. 8 కోట్ల లాభాలు వచ్చాయి. గీతా ఆర్ట్స్ సొంతంగా 18 పేజెస్ విడుదల చేశారు. కాబట్టి వసూళ్ల ద్వారా వచ్చిన ప్రతి రూపాయి గీతా ఆర్ట్స్ కి చెందుతుంది. అది అదనపు లాభం... అని ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. 

కలెక్షన్స్ ద్వారా కోటి వచ్చినా రెండు కోట్లు వచ్చినా అది కూడా లాభమే. గీతా ఆర్ట్స్ 18 పేజెస్ మూవీతో విడుదలకు ముందే లాభాల్లోకి ప్రవేశించిందంటూ ఆయన చెప్పకనే చెప్పారు. సుకుమార్ శిష్యుడు పలనాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఉన్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటించారు. బ్యాక్ టు బ్యాక్ ఆమె హీరో నిఖిల్ తో రెండు సినిమాలు విడుదల చేశారు.