యంగ్ హీరో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. కావాలనే కొందరు తన పేరును వాడుకుంటున్నట్లు చెబుతూ ఫైర్ అయ్యారు. వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే నటుడు నిఖిల్ ప్రస్తుతం 'ముద్ర' సినిమాలో నటిస్తున్నాడు.

తమిళ 'కనితన్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ శుక్రవారం(25-01-2019) సినిమా విడుదల కాబోతుందంటూ ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై స్పందించిన హీరో నిఖిల్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.

''ఈ వారం నా సినిమా రిలీజ్ కావడం లేదు. కొంతమంది వ్యక్తులు కావాలనే నా సినిమా టైటిల్ ను సేమ్ డిజైన్ తో వాడుకున్నారు. టికెట్ బుకింగ్ యాప్ లో నా పేరుని కూడా వాడుతున్నారు. మా నిర్మాతలు సదరు వ్యక్తులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని'' ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది.