యంగ్ హీరో నిఖిల్ మరో విభిన్నమైన మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆయన హీరోగా తెరెక్కుతున్న లేటెస్ట్ మూవీ 18 పేజెస్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నేడు నిఖిల్ బర్త్ డే పురస్కరించుకుని 18 పేజెస్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సుకుమార్ చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కావడం జరిగింది. 


తెల్లని కాగితం కళ్ళకు అడ్డుగా కట్టుకొని నిఖిల్ కూర్చొని ఉండగా, అనుపమ పరమేశ్వరన్ ఆ పేపర్ పై రొమాంటిక్ లేఖ రాస్తున్నారు. 'నా పేరు నందిని నాకు మొబైల్ లో అక్షరాలు టైప్ చేయడం కన్నా ఇలా కాగితంపై రాయడం ఇష్టం.టైప్ చేసిన అక్షరాలకి ఎమోషన్స్ ఉండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతీ అక్షరానికి ఒక ఫీల్ ఉంటుంది. దానిపై నీ సంతకం ఉంటుంది.నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది' అని ఆ కాగితంపై రాసి ఉంది. 

ఇక 18 పేజెస్  రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని అర్థం అవుతుంది. ఫస్ట్ లుక్ లో అనుపమ, నిఖిల్ క్యారెక్టర్స్ ఆసక్తి రేపుతున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హిట్ చిత్రాల బ్యానర్ గా పేరున్న గీతా ఆర్ట్స్ 2 తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఉంది.