విలక్షణ నటుడిగా రాణిస్తున్న హీరో నవీన్‌ చంద్ర తండ్రి అయ్యారు. ఆయన భార్య పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నటుడు తాజాగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

హీరో నవీన్‌ చంద్ర తండ్రి అయ్యారు. ఆయన భార్య ఓర్మా బుధవారం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తాజాగా నవీన్‌ చంద్ర వెల్లడించారు. చిన్నారితో దిగిన ఫోటోలను పంచుకున్నారు నవీన్‌ చంద్ర. `నేను, ఓర్మా కుమారుడితో ఆశీర్వదించబడ్డాము` అని తెలిపారు. ఆ చిన్నారి కాలుని ముద్దాడుతూ నవీన్‌ చంద్ర తన ఆనందాన్ని పంచుకున్నారు. మరోవైపు చిన్నారి కాలుతో టచ్‌ చేయించుకుంటూ తండ్రిగా అమితమైన ఆనందాన్ని పొందుతున్నారు. తాజాగా ఆయన పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో హీరోగా, విలన్‌గా, విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు నవీన్‌ చంద్ర. అయితే ఎప్పుడూ ఆయన తన పర్సనల్‌ లైఫ్‌ని బయటపెట్టలేదు. మ్యారేజ్‌, భార్యకి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. గతేడాది వాలెంటైన్స్ డే సందర్భంగా భార్య ఓర్మాని పరిచయం చేశారు. తనలో సగం అంటూ ఆమెపై ప్రేమని పంచుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత తాను తండ్రి కావడం విశేషం. నవీన్‌ చంద్ర `అందాల రాక్షసి` చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందారు. ఇందులో విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. పాపులర్‌ అయ్యారు.

ఆ తర్వాత `దళం`, `భమ్‌ భోలేనాథ్‌`, `నా రాకుమారుడు`, `త్రిపుర`, `లచ్చిందేవికి ఓ లెక్కుంది`, ``మీలో ఎవరు కోటీశ్వరుడు`, `నేను లోకల్‌`, `జూలియల్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌`, `దేవదాస్‌`, `అరవింద సమేత`, `ఎవరు`, `భానుమతి అండ్‌ రామకృష్ణ`, `మిస్‌ ఇండియా`, `మోసగాళ్లు`, `అర్థ శతాబ్ధం`, `గని`, `విరాటపర్వం`, `రంగ రంగ వైభవంగా`, `అమ్ము` వంటి చిత్రాల్లో నటించారు. హీరోగా, విలన్‌గా, కీలక పాత్రల్లో మెప్పిస్తున్నారు. మరోవైపు వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తూ నటుడిగా నిరూపించుకుంటున్నారు. ఓటీటీలో మోస్ట్ ప్రామిసింగ్‌ యాక్టర్‌గా నిలుస్తున్నారు నవీన్‌ చంద్ర.