నవదీప్ పెల్లి చేసుకోబోతున్నాడా..? ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది..? అమ్మాయి ఫోటోతో నవదీప్ పోస్ట్ వెనకాల రీజన్ ఏంటీ..? ఇంతకీ నవదీప్ పెళ్ళి ఎప్పుడూ..
ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్లు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. యంగ్ హీరోలంతా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. రీసెంట్ గా నాగశౌర్య పెళ్లి చేసుకున్నాడు. శర్వానంద్ ఎంగేజ్ మెంట్ అయిపోయింది. బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్ర, కియారా అద్వాని పెళ్లయిపోయింది. ఇలా ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతుండగా.. టాలీవుడ్ నుంచి మరో హీరో పెళ్ళి పీటలెక్కుతున్నాడట. టాలీవుడ్ రొమాంటిక్ హీరో నవదీప్ పెళ్ళికి రెడీ అయ్యాడ.
ఇక వియానికొస్తే.. తాజాగా నవదీప్ పెట్టిన ఇన్ స్టా స్టోరీ వైరల్ గా మారింది. అందులో ఖుషీ అహుజా అనే అమ్మాయిని ట్యాగ్ చేసి, ఎంగేజ్ మెంట్ రింగ్ తో ఉన్న ఫొటోని పోస్ట్ చేశాడు. వాలంటైన్స్ డే రోజు ఈ పోస్ట్ పెట్టేసరికి.. నవదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు. బ్లర్ గా ఉన్న అమ్మాయి పోటో.. ఎంగేజ్మెంట్ రింగ్ తో.. ఉన్న పిక్ శేర్ చేయడంతో అంతా పెళ్లి డేట్ ఎప్పుడంటూ కామెంట్లు కూడా పెట్టారు. అయితే ఇది నిజమేనా అని చాలా మందికి డౌట్ కూడా వచ్చింది.
అయితే ఇదంతా నిజం కాదని... ప్రాంక్ చేసేందుకు నవదీప్ అలా చేసినట్లు తరువాత తెలిసింది. నిజంగా నవదీప్ పెళ్ళేమో అని అంతా అనుకుంటున్న టైమ్ లో.. ఇదంతా నిజం కాదు అని తెలిసింది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల్ చాలా మంది ఉన్నారు. 40 ఏళ్లు దాటుతున్న పెళ్ళి కాని ప్రసాద్ లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్ లాంటి 40 ఇయర్స్ దాటినవారు చాలా మంది పెళ్ళికి ఉన్నారు. ఇక 30 దాటినవారు అయితే చాలా మంది ఉన్నారు. సాయి తేజ్, వరుణ్ తేజ్.. లాంటియంగ్ స్టార్స్ పెళ్ళి ఇంకా అవ్వలేదు. ఇక ఈక్రమంలోనే ఈ లిస్ట్ లో నవదీప్ పేరు కూడా ఉంది.
టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్, విలన్ గా మారిపోయాడు. డిఫరెంట్ రోల్స్ చేస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించాడు నవదీప్. ఇక అవకాశాలు తగ్గిన టైమ్ లో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో సందడి చేశాడు యంగ్ స్టార్. లవ్ మౌళి అనే సినిమాతో పాటు న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు టాలీవుడ్ స్టార్. ఈరెండు త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.
