నేచురల్‌ స్టార్‌ నాని.. ప్రతిభ ఉంటే రాణించడం సాధ్యమే అని నిరూపించుకున్న నటుడు. మామూలు మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన నాని, ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా స్వతహాగా ఎదిగారు. ఇప్పుడు స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. జయాపజయాలను అదిగమిస్తూ, ఆటుపోట్లని తట్టుకుని ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం `శ్యామ్‌ సింగరాయ్‌`, `టక్‌ జగదీష్‌`, `అంటే సుందరానికి` వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. 

ఇదిలా ఉంటే నాని తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను నటించిన హిట్‌ చిత్రాల్లో `రైడ్‌` సినిమా ఒకటి. ఇందులో నటించమని నిర్మాత బెల్లంకొండ సురేష్‌ చెప్పారట. కానీ తనకు సూట్‌ కాదని, ఇదే విషయాన్ని బెల్లంకొండకి చెప్పాలని ఆఫీస్‌కి బయలు దేరాడట. కానీ ఆయన బలవంతంగా ఈ చిత్రంలో నటింప చేశారని, అది తన కెరీర్‌లో పెద్ద హిట్‌ చిత్రంగా నిలిచిందని, తన కెరీర్‌కి చాలా ఉపయోగపడిందని చెప్పారు నాని. 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రూపొందిన `అల్లుడు అదుర్స్` చిత్ర ట్రైలర్‌ని మంగళవారం నాని గెస్ట్ గా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు నాని. ఆ సమయంలో నిర్మాత బెల్లంకొండ పక్కనే ఉండటం విశేషమైతే. బెల్లంకొండ సురేష్‌ తనయుడే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కావడం మరో విశేషం.