హీరో నాని దసరా మూవీ ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతుంది. విగ్గులతో నెట్టుకొస్తున్న హీరోలపై ఆయన దారుణమైన సెటైర్ వేశారు.

యాక్టింగ్ రిస్కీ అండ్ హార్డ్ జాబ్. లగ్జరీ లైఫ్ వెనుక చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి. ఒక టైమూ పాడూ ఉండదు. పట్టుమని పది రోజులు ఇంటి దగ్గర ఉండే అవకాశం దొరకదు. ఊళ్లు పట్టుకు తిరగాలి. దొరికింది తినాలి. ప్రతికూల వాతావరణంలో పని చేయాలి. పాత్రల కోసం బరువు పెరగడం తగ్గడం, జుట్టు పెంచడం తగ్గించడం... అబ్బో ఒకటేమిటి అనేకం ఉంటాయి. ఈ క్రమంలో ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంది. శరీరంలో ఏర్పడే మార్పులు జుట్టు మీద ప్రభావం చూపుతాయి.. 

ఒత్తిడితో పాటు నిద్ర లేకుండా పని చేయడంతో చాలా మంది హీరోలకు జుట్టు ఊడిపోతుంది. ఒక వయసు వచ్చాక సహజంగానే నెత్తి పలచబడుతుంది. టాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరోలు విగ్గులతో నెట్టుకొస్తున్నారు. సహజమైన జుట్టు ఉన్నోళ్లు కొద్ది మంది మాత్రమే. విగ్గులపై ఆధారపడిన హీరోల మీద హీరో నాని దారుణమైన సెటైర్ వేశారు. నాది ఒరిజినల్ మిగతా హీరోలది ఒరిజినల్ జుట్టు కాదని అర్థం వచ్చేలా ఒక కామెంట్ చేశారు. 

Scroll to load tweet…

దసరా చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న నానిని యాంకర్... ఈ చిత్రం కోసం మీరు జుట్టు పెంచారు. అది ఒరిజినలే కదా? అని అడిగారు. యాంకర్ ప్రశ్నకు సమాధానంగా నాని '100% ఒరిజినల్ అండి. ఇదే ప్రశ్న అందరినీ అడగకండి!' అంటూ గట్టిగా నవ్వేశారు. చాలా మంది హీరోలు విగ్గులు వాడుతున్నారు. కాబట్టి మిగతా హీరోలను మీ జుట్టు ఒరిజినలేనా? అని అడగకండి, అని నాని పరోక్షంగా చెప్పారు. 

యాంకర్ ప్రశ్నకు నా జుట్టు సహజమైందని చెప్తే సరిపోతుంది. నాని మాత్రం ఓ అడుగు ముందుకేసి ఇతర హీరోలకు గుచ్చుకునేలా కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. కాగా దసరా మార్చి 30న వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు.