హీరో నాగార్జున కొత్త కారు కొన్నారు. నాగార్జున, అమల కొత్త కారు ముందు పోజివ్వగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


నాగార్జున లగ్జరీ కార్ కలెక్షన్స్ లోకి మరొక ఖరీదైన కార్ వచ్చి చేరింది. ఆయన కియా ఈవీ 6 కొనుగోలు చేశారు. ఇది ఎలక్ట్రిక్ కార్ అని తెలుస్తుంది. అద్భుతమైన ఫీచర్స్ దీని సొంతం. వైర్లెస్ ఛార్జర్, ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. డ్రైవర్ సీటు పది రకాలు అడ్జస్ట్ చేసుకునే వీలుంది. కేవలం నాలుగు నిమిషాలు ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. అంత ఆల్ట్రా ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. ఫుల్ కెపాసిటీ 77.4 కిలో వాట్స్ ఛార్జ్ చేస్తే 528 కిలోమీటర్స్ ప్రయాణం చేయవచ్చు. ఇక ఈ కార్ ధర రూ. 60 నుండి 70 లక్షలు ఉంటుంది. 

మరోవైపు నాగార్జున కొత్త మూవీ ప్రకటన చేశారు. తన 62వ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం అని సమాచారం. రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్, మోహన్ రాజాలతో నాగార్జున మూవీ చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఆ రెండు ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అయ్యాయని మరో వాదన. 

ఇక నాగార్జున సోలోగా హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. 2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా మంచి విజయం సాధించింది. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన మన్మథుడు 2, వైల్డ్ డాగ్, ఘోస్ట్ పరాజయం పొందాయి. కొడుకు నాగ చైతన్యతో కలిసి చేసిన బంగార్రాజు పర్లేదు అనిపించుకుంది. అటు నాగ చైతన్య, అఖిల్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు.