Asianet News TeluguAsianet News Telugu

రజినీకాంత్ కూలీ నుండి నాగార్జున ఫస్ట్ లుక్... అంచనాలు పెంచేసిన లోకేష్ కనకరాజ్!


రజినీకాంత్-లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ. ఈ చిత్రం నుండి నాగార్జున ఫస్ట్ లుక్ విడుడుదల చేయగా ఆసక్తి రేపింది. 
 

hero nagarjuna birth day special first look from rajinikanth starer coolie ksr
Author
First Published Aug 29, 2024, 6:58 PM IST | Last Updated Aug 29, 2024, 6:59 PM IST


వరుస చిత్రాలతో రజినీకాంత్ బిజీ. ఆయన గత చిత్రం జైలర్ భారీ విజయం అందుకుంది. చాలా కాలం అనంతరం రజినీకాంత్ తన స్థాయి హిట్ కొట్టాడని చెప్పొచ్చు. జైలర్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం రజినీకాంత్ రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. వేటగాడు, కూలీ చిత్రాలను ఏక కాలంలో పూర్తి చేస్తున్నాడు. వేటగాడు చిత్రానికి టీజీ జ్ఞానవేల్ దర్శకుడు. దసరా కానుకగా అక్టోబర్ 10న వేటగాడు విడుదల కానుంది. 

అయితే కూలీ పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కూలీ మూవీకి లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడమే ఇందుకు కారణం. ఖైదీ, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో లోకేష్ కనకరాజ్ క్రేజ్ రాబట్టాడు. ఆయన మొదటిసారి రజినీకాంత్ తో మూవీ చేస్తున్నారు. రజినీకాంత్ 171వ చిత్రంగా కూలీ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో స్టార్ క్యాస్ట్ భాగమయ్యారు. 

శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ కీలక రోల్స్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున ఓ పాత్ర చేయడం విశేషం. కూలీ లో ఆయన నెగిటివ్ రోల్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. కాగా నాగార్జున జన్మదినం పురస్కరించుకుని కూలీ నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మాస్, ఇంటెన్స్ లుక్ లో నాగార్జున మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక నాగార్జున పాత్ర పేరు సైమన్ గా పోస్టర్ లో తెలియజేశారు. 

కూలీ మూవీలో నాగార్జున రోల్ చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారని లుక్ చూస్తే అర్థం అవుతుంది. మొత్తంగా నాగార్జున ఫస్ట్ లుక్ కూలీ మూవీపై అంచనాలు మరో స్థాయికి చేర్చాయి. కూలీతో పాటు నాగార్జున కుబేర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కుబేర మూవీలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు. భవిష్యత్ లో నాగార్జున నుంచి మంచి ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios