యువకుడితో నాగశౌర్య వివాదం.. నడిరోడ్డుపై యువతిని కొట్టినందుకు యంగ్ హీరో ఆగ్రహం.!

యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) తాజాగా ఓ యువకుడి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై యువతిని కొట్టడంతో సహనం కోల్పోయి యువకుడిని నిలిదీశాడు. 
 

Hero Naga Shaurya angry on young boy behavior

యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) రీసెంట్ గా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టి తన ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. ప్రస్తుతం తన సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉంటే..  తాజాగా నాగశౌర్య నడిరోడ్డుపై ఓ యువకుడి ప్రవర్తనను సహించలేకపోయాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగింది? నాగ శౌర్య ఎందుకలా రియాక్ట్ అయ్యారనేది ఆసక్తికరంగా మారింది. 

వీడియో ఆధారంగా.. నాగశౌర్య కారులో వెళ్తుండగా.. ఓ యువకుడు తన లవర్ (యువతి)పై చేయిచేసుకున్నాడని తెలుస్తోంది. అది చూసిన యంగ్ హీరో యువకుడి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులోంచి దిగి యువకుడి చేయి పట్టుకొని రోడ్డు మీద అమ్మాయిని కొడతావా ‘ఆమెకు సారీ చెప్పు’ అంటూ వాగ్వాదానికి దిగారు. ఆ యువకుడు ఆమె నా లవరే అంటూ బదులిచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ‘నీ లవరైతే కొడ్తారా?.. అలా చేయడం తప్పు.. వెంటనే ఆమెకు సారీ చెప్పు అంటూ మందలించాడు.’

హైదరాబాద్ లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన ఘటనతో కాస్తా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అక్కడే ఉన్న కొందరు ఆసీన్ ను అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఘటనపై నెటిజన్లూ స్పందిస్తున్నారు. అమ్మాయికి మద్దతుగా నిలవడం పట్ల నాగశౌర్యను ప్రశంసిస్తున్నారు. మానవత్వాన్ని చాటుకున్న యంగ్ హీరోను అభినందిస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఇదంతా ఒక ప్రాంక్ అని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు త్వరలో నాగశౌర్య సినిమా కూడా విడుదల కానుండటం గమనార్హం అంటున్నారు. ఏదేమైనా నాగశౌర్య యువకుడిని నిలదీయడం నెట్టింట వైరల్ గా మారింది. 

ప్రస్తుతం నాగశౌర్య తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. శ్రీనివాస అవసరాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం మార్చి 17న రిలీజ్ కానుంది. చిత్రంలో మాళవికా నాయిర్ నాగశౌర్యకు జంటగా నటిస్తోంది. అలాగే శౌర్య మరో రెండు చిత్రాలు.. ‘నారీ నారీ నడుమ మురారి’, ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. గతేడాది నవంబర్ 20న నాగశౌర్య అనూష శెట్టి అనే యువతీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని ఓ హోటల్ లో వీరి పెళ్లివేడుక ఘనంగా జరిగింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios