అక్కినేని హీరో నాగ చైతన్య లేటెస్ట్ మూవీ కస్టడీ. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించారు.
నాగ చైతన్య ఇతర పరిశ్రమల్లో మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా బైలింగ్వెల్ మూవీ చేశారు. కస్టడీ తెలుగు, తమిళ భాషల్లో మే 12న విడుదల కానుంది. చైతూ గతంలో చేయని డిఫరెంట్ అండ్ సీరియస్ సబ్జెక్టుతో కస్టడీ తెరకెక్కింది. ఆయన పోలీస్ రోల్ చేస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన కస్టడీ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రమోషన్స్ లో భాగంగా నేడు చెన్నైలో కస్టడీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. కోలీవుడ్ చిత్ర ప్రముఖులతో పాటు కస్టడీ యూనిట్ ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. హీరో నాగ చైతన్య, హీరోయిన్ కృతి శెట్టి, కీలక రోల్ చేసిన ప్రియమణి, దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. కార్యక్రమం చివర్లో నాగ చైతన్య మాట్లాడారు. తమిళ అభిమానుల నుండి ఈ స్థాయి రెస్పాన్స్ ఊహించలేదని ఆయన అన్నారు. కస్టడీ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ నాగ చైతన్య ధన్యవాదాలు తెలిపారు.
నాగ చైతన్య చాలా వరకు తమిళ్ లో మాట్లాడటం విశేషం. నాగ చైతన్య తల్లిగారు చెన్నైలోనే ఉంటారు. ఆ విధంగా చైతూకి తమిళ్ వచ్చు. నాగ చైతన్య తమిళ్ స్పీచ్ ఆసక్తికరంగా సాగింది. ఆయన తమిళ అభిమానులకు ఓ విన్నపం చేశారు. తనను అంగీకరించాలని కోరుకున్నారు. కస్టడీ మంచి చిత్రం అందరికీ నచ్చుతుందని హామీ ఇచ్చారు. కృతి శెట్టి నా కంటే సీనియర్. తమిళ పరిశ్రమలో ఆమె ముందు అడుగుపెట్టారని చమత్కరించారు.
నాగ చైతన్య తమిళ ఆడియన్స్ ని తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఈ మూవీలో అరవింద స్వామి కీలక రోల్ చేశారు. ఇక ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. శ్రీనివాస్ చిత్తూరి నిర్మాతగా ఉన్నారు. నాగ చైతన్య గత చిత్రం థాంక్యూ నిరాశపరిచింది. కస్టడీ మూవీతో కమ్ బ్యాక్ కావాలని అనుకుంటున్నారు.
