నాగ చైతన్య లేటెస్ట్ కస్టడీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. 


నాగ చైతన్య ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. కస్టడీ చిత్రంలో ఆయన సీరియస్ అండ్ రివల్యూషనరీ రోల్ చేస్తున్నట్లు సమాచారం. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. కృతి శెట్టి కూడా గత చిత్రాలకు భిన్నమైన పాత్ర చేస్తున్నారు. కృతి లుక్ రివీల్ చేయగా... ఆమె ముఖంలో లోతైన వేదన కనిపిస్తుంది. కటకటాల వెనుక ఉన్నట్లు ఆమెను చూపించడం విశేషం. 

ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. నాగ చైతన్య తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేశారు. కస్టడీ మూవీని శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నారు. వెంకట్ ప్రభు సామాజిక కోణాన్ని టచ్ చేస్తూ తెరకెక్కించారని సమాచారం. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో మే 12న విడుదల కానుంది. 

Scroll to load tweet…

నాగ చైతన్య గత చిత్రం థాంక్యూ డిజాస్టర్ అయ్యింది. బంగార్రాజు వరకు ఆయన హిట్ ట్రాక్ కంటిన్యూ చేశారు. దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన థాంక్యూ ప్రేక్షకులను నిరాశ పరిచింది. కస్టడీ చిత్రంతో ఆయన కమ్ బ్యాక్ కావాలనుకుంటున్నారు. ఇక కృతి శెట్టికి ఈ చిత్ర విజయం చాలా అవసరం. ఆమె కూడా ప్లాప్స్ లో ఉన్నారు. కృతి శెట్టి గత మూడు చిత్రాలు ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి... పరాజయం పాలయ్యాయి.