Asianet News TeluguAsianet News Telugu

ఆకట్టుకుంటున్న ‘జిన్నా’ టీజర్.. డైలాగ్స్, యాక్షన్ తో అదరగొట్టిన హీరో మంచు విష్ణు.!

హీరో మంచు విష్ణు నటించిన చిత్రం ‘జిన్నా’ (Ginna). తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. మరోవైపు టీజర్ ఈవెంట్ లో మంచు విష్ణు ఆసక్తిరమైన వ్యాఖ్యలు చేశారు.  

Hero Manchu Vishnu Zinna Movie teaser Out!
Author
First Published Sep 9, 2022, 4:20 PM IST

డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా' (Ginna). అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ భారీ తారాగణం, బడా సాంకేతిక నిపుణులతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) విష్ణు సరసన నటిస్తోంది. సన్నీ లియోన్ మరో గ్లామర్ రోల్ లో కనిపించనుంది. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి.. కోన వెంకట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.

జిన్నా టీజర్ వేడుక హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఈ రోజు ఘనంగా జరిగింది. వేడుకలో విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్, కోన వెంకట్, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. తాజాగా విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో విష్ణు డైలాగ్ డిక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ లా అనిపిస్తున్నప్పటికీ.. టీజర్ చివరిలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సర్ ప్రైజ్ చేస్తున్నాయి. గతంలో విష్ణు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ఢీ, దేనికైనా రెడీ చిత్రాల తర్వాత విష్ణు కెరీర్ లో ఆ స్థాయి విజయాన్ని అందుకోగల సత్తా ఉన్న సినిమాగా ‘జిన్నా’ను నమ్ముతున్నారు. మరోవైపు విష్ణు నయా లుక్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది.

టీజర్ విడుదల సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. "అభిమానుల ప్రేమ, అభిమానం కోసమే సినిమాలు చేస్తున్నాం. అభిమానులు లేకపోతే మేం లేం. ‘జిన్నా’ నా మనసుకి దగ్గరైన సినిమా. ఇందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. నా బంగారు తల్లులు అరియనా, విరియానా పాట పాడారు. నా కెరీర్ లో నాగేశ్వరరెడ్డికి ప్రత్యేక స్థానముంటుంది. నేను ఆయన్ని బ్రదర్ అని పిలుస్తా. డౌన్ లో ఉన్న టైంలో ఆయన నాకు ‘దేనికైనా రెడీ’తో సూపర్ హిట్ ఇచ్చారు. ఈ సినిమాలో నా కంటే ముందు సన్నీనే ఫైనల్ చేశారు. కానీ ఇక్కడ సన్నీని ఎలా రిసీవ్ చేసుకుంటారని భయం ఉండేది. ‘ఢీ’ ఇచ్చిన శ్రీను వైట్ల తర్వాత నన్ను అంతలా మెప్పించాడు డైరెక్టర్ సూర్య. అనూప్ తో ఎప్పటినుంచో పని చేయాలి అనుకున్నాను. ఈ సినిమాతో కుదిరింది. దేశంలోని గొప్ప సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన చోటాతో పని చేయడం గర్వంగా ఉంది. హీరోయిన్ గా పాయల్ అనగానే.. ఒకవైపు సన్నీ, మరోవైపు పాయల్ ఇక నన్ను ఎవరు చూస్తారు అనుకున్నా’ అంటూ వ్యాఖ్యానించడం అందరినీ ఆకట్టుకుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios