ఈసారి ఎలాగైనా సాలిడ్ హీట్ కొట్టాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాడు మంచు విష్ణు. అందుకే  మానవ ప్రయత్నంతో పాటు దేవుడ ఆశీర్వాదాల కూడా కావాలంటున్నాడు. తన సినిమా సక్సెస్ కావాలని కోరకుంటూ యాదగిరీ నరసింహుని దర్శనానికి వచ్చాడు మంచు విష్ణు. 

ఈసారి ఎలాగైనా సాలిడ్ హీట్ కొట్టాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాడు మంచు విష్ణు. అందుకే మానవ ప్రయత్నంతో పాటు దేవుడ ఆశీర్వాదాల కూడా కావాలంటున్నాడు. తన సినిమా సక్సెస్ కావాలని కోరకుంటూ యాదగిరీ నరసింహుని దర్శనానికి వచ్చాడు మంచు విష్ణు. 

ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మంచు విష్ణు హీరోగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా జిన్నా. ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు మంచు. ఈమూవీ పక్కాగా సక్సెస్‌ అవ్వాలని కోకుంటూ యాదగిరి లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు కూడా చేయించాడు విష్ణు. అంతే కాదు ఈమూవీ సక్సెస్ అయితే కుటుంబ సమేతంగా వచ్చి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారికి మొక్కులు తీర్చుకుంటమని సినీ నటుడు మంచు విష్ణు తెలిపారు. 

బుధవారం మంచు విష్ణు.. రచయిత కోన వెంకట్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి సినిమా సక్సెస్‌ కావాలని మొక్కుకున్నారు. చాలా రోజులుగా మంచి సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. 21న ప్రేక్షకుల ముందు కు రాబోయే జిన్నా సినిమా మంచి ప్రేక్షకాదరణ పొంది గొప్ప విజయాన్ని సాధించడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు.

విష్ణు రావడంతో గుట్టమీద కాస్త సందడి వాతావరణం కనిపించింది. సినీ నటులు, రాజకీయ నాయకులు వస్తే సాధారణంగానే సందడి చేస్తుంటారు జనాలు. ఇక మంచు విష్ణు ను చూసి కూడా కేరింతలు కొట్టారు జనాలు. ఇక పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ఫీమేల్ లీడ్ చేసిన జిన్నాసినిమాను సూర్య డైరెక్ట్ చేయగా.. కోనా వెంకట్ రచయితగా పనిచేశారు. ఇక ఈ మూవీలో గాలి నాగేశ్వరావ్ అనే ఫన్నీ క్యారెక్టర్ లో విష్ణు కనిపించబోతున్నాడు.