విడాకులా...? వాళ్ల బొంద..!

First Published 9, Jun 2018, 9:49 AM IST
hero manchu manoj clarify about his divorce
Highlightsవిడాకులపై స్పందించిన మంచు మనోజ్

హీరో మంచు మనోజ్.. తన భార్య ప్రణతితో విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంలో మోహన్ బాబు కూడా సీరియస్ గా ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగింది. ఇప్పటికే ప్రణిత..మనోజ్ కి దూరంగా అమెరికాలో ఉంటోందని కూడా ఆ వార్తల్లో పేర్కొన్నారు. కాగా.. అవన్నీ అబద్ధాలని తేల్చేశాడు మంచువారి అబ్బాయి. 

ఓ అభిమాని నేరుగా మనోజ్‌నే ట్విటర్లో  విడాకుల విషయం నిజమేనా బ్రదర్ అని అడిగేశాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. ‘వాళ్ల బొంద.. 2010 నుంచి తను నా జీవితంలో అడుగు పెట్టింది. నా గుండె ఆగిపోయేంత వరకు తనే నా దేవత.. ఇలాంటి తప్పుడు వార్తల్ని నమ్మొద్దు. రూమర్స్ పుట్టించే వాళ్లకు మా గురించి ఏం తెలుసు?’ అని అన్నాడు. మనోజ్, ప్రణతిల పెళ్లి మూడేళ్ల కిందట జరిగింది. విభేదాలతో వీరిద్దూ విడిపోతున్నారని కొన్నాళ్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని, ఇద్దరూ కలిసి ఉండడం లేదని చెబుతున్నారు. మనోజ్‌కు హిట్లు లేకపోవడంతో భార్య అతణ్ని చులకనగా చూస్తోందని ఏవేవో కథలు అల్లేస్తున్నారు.

loader