Mahesh Babu: మూమెంట్ ఈజ్ మెడిసిన్... క్రేజీ వర్క్ అవుట్ పిక్ షేర్ చేసిన మహేష్ బాబు!
హీరో మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆయన తన వర్క్ అవుట్ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు)Mahesh Babu) ఫిట్నెస్ ఫ్రీక్. ఐదు పదుల వయసు దగ్గరపడుతున్నా ఆయన స్టిల్ కాలేజ్ స్టూడెంట్ లుక్ మైంటైన్ చేస్తున్నారు. సహజంగా సంక్రమించిన అందంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలి ఇందుకు కారణం. మహేష్ బాబు దినచర్యలో వ్యాయామం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఆహారం విషయంలో కూడా నియమాలు పాటిస్తారు. ఇండియాలోనే అత్యంత అందమైన హీరోగా మహేష్ బాబు ఉన్నారు. తాజాగా ఆయన వర్క్ అవుట్ ఫోటో షేర్ చేశాడు. సదరు ఫోటోకి ఆసక్తికర కామెంట్ పెట్టారు.
'అద్భుతమైన స్ట్రెచ్... ఒకే సమయంలో ఈ మూమెంట్ ద్వారా హిప్స్, స్పైనల్, షోల్డర్స్ ఓపెన్ చేయవచ్చు. మనిషికి కదలికే మెడిసిన్...' అని సదరు ఫోటోకి మహేష్ బాబు కామెంట్ జోడించారు. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నాడు. హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అనుకున్న ప్రకారం గుంటూరు కారం చిత్ర చిత్రీకరణ జరగలేదు. దీంతో 2024 సంక్రాంతికి గుంటూరు కారం విడుదల కావడం కష్టమే అంటున్నారు.
అయితే చెప్పినట్లే గుంటూరు కారం సంక్రాంతి బరిలో ఉంటుందని మహేష్ ఇటీవల చెప్పారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
వచ్చే ఏడాది రాజమౌళి-మహేష్ మూవీ పట్టాలెక్కనుందని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. రాజమౌళి మూవీ అనంతరం దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మహేష్ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.