పూరి జగన్నాధ్ మాటలు విని కనీసం ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకుందాం అంటున్నారు యంగ్ హీరో కార్తికేయ. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్తికేయ ఓ ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ లో ఆయన పూరి జగన్నాధ్ ఆడియో ఫైల్ ట్యాగ్ చేయడంతో  పాటు ఆ మాటలు విని ఇనకైనా సిగ్గు తెచ్చుకుందాం అని ట్వీట్ చేశారు. ఇంతకీ పూరి ఆ ఆడియోలో ఏమి చెప్పారంటే...కర్మ భూమి, వేద భూమి, భరత మాత అని మనం దేశం గురించి చెప్పుకుంటాము, చేతల్లో మాత్రం చేసేవన్నీ చెడ్డపనులే  అన్నారు. కరెంట్ దొంగతనం నుండి టికెట్ లేకుండా రైల్ లో ప్రయాణించే వరకు అనేక తప్పులు చేసి వుంటారు. అవన్నీ ఎవరూ లేనప్పుడు ఒక పేపర్ పై రాసుకోండి. భవిష్యత్ లో అవి మరలా చేయకుండా చూసుకోండి అన్నారు.

బోర్డర్ లో సైనికులు తల్లిదండ్రులు, భార్యాపిల్లలు వంటి బంధాలు వదిలేసి దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. కనీశం మీరు గోడమీద మూత్రం పోయకండి, అది కూడా దేశ సేవే అని కొంచెం ఘాటుగా చెప్పారు. ఈ వ్యాఖ్యలనే ట్వీట్ చేసిన కార్తీక్ , విని సిగ్గుతెచ్చుకోవాలని కోరారు. మ్యూసింగ్స్ పేరుతో విడుదలైన పూరి ఆడియో ఫైల్స్ విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. అనేక మంది వీటిని ప్రత్యేకంగా వింటున్నారు. అలాగే జీవితంలోని అనేక కోణాలను స్పృశిస్తూ గొప్ప సలహాలిచ్చిన పూరిని అందరూ ప్రశంసిస్తున్నారు.

జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న పూరి అనుభవసారం నుండి వచ్చిన ఈ పాఠాలు నిజమే కదా అనిపిస్తున్నాయి. లాక్ డౌన్ ప్రకటన సమయంలో కూడా ప్రపంచంలో అనేకమంది అస్థిరత వలన తిండి, నీరు లేక కొందరికి బ్రతుకుపై భరోసా లేక దుర్బర జీవితాలు గడుపుతున్నారు. దానితో పోల్చుకుంటే లాక్ డౌన్ సమయంలో కొన్ని రోజులు ఇంటిలో ఉండడం చాలా చిన్న విషయం అని పూరి చెప్పడం జరిగింది. ఇక పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు.