హీరో నాని, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'జెర్సీ' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకొంది. ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా మరో యంగ్ హీరో ఈ లిస్ట్ లో చేరాడు.

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంలో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న నటుడు కార్తికేయ, హీరో నానితో కలిసి 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నటిస్తున్నాడు. గతంలో నానితో కలిసి నటిస్తుండడంతో ఆనందం వ్యక్తం చేసిన కార్తికేయ 'జెర్సీ' సినిమా చూసి మరోసారి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

ఇన్నాళ్లు నానితో నటించబోతున్నందుకు ఆనందంగా  ఉందని, కానీ ఇప్పుడు 'జెర్సీ' సినిమాలో అర్జున్ పాత్ర పోషించిన వ్యక్తితో నటించబోతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

ఓ తెలుగు సినిమా అభిమానిగా టాలీవుడ్ లో నాని లాంటి గొప్ప నటుడు ఉన్నాడని కాలర్ ఎగరేస్తా అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం కార్తికేయ 'హిప్పీ', 'గుణ 369' వంటి చిత్రాలలో నటిస్తున్నాడు.