యువ హీరో కార్తికేయ ఆర్ఎక్స్ 100 చిత్రంతో అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ కుర్ర హీరో పేరు మారుమోగింది.ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం బెదురులంక 2012. 

యువ హీరో కార్తికేయ ఆర్ఎక్స్ 100 చిత్రంతో అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ కుర్ర హీరో పేరు మారుమోగింది. కానీ ఆ చిత్రం ఇచ్చిన విజయాన్ని కార్తికేయ కొనసాగించలేకపోయాడు. ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. 

ఆగష్టు 25న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే అన్ని అంశాలతో ఆసక్తికరంగా ఉంది. 2012 యుగాంతం కాన్సెప్ట్ ని దర్శకుడు బెదురులంక గ్రామం చుట్టూ ఫన్నీగా నేరేట్ చేయబోతున్నారు. ఫన్, రొమాన్స్, కొంచెం యాక్షన్ కూడా ట్రైలర్ లో కనిపిస్తోంది. ముఖ్యంగా కార్తియ, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ.. కమెడియన్స్ చేసే ఫన్నీ మూమెంట్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 

2012 డిసెంబర్ 21 ప్రపంతం అంతా యుగాంతం వస్తుందని ప్రళయం వస్తుందని భయపడిన రోజు.. కానీ ఎక్కడా ఏమీ జరగలేదు ఒక్క మా ఊర్లో తప్ప అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతుంది. నేహా శెట్టి తన గ్లామర్ తో మరోసారి యువతకి గిలిగింతలు పెడుతోంది. వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు ట్రైలర్ లో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. వెన్నెల కిషోర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను లాంటి కమెడియన్లు ట్రైలర్ లో కనిపిస్తున్నారు. 

YouTube video player

అసలు బెదురులంక గ్రామంలో ఏం జరగబోతోంది.. యుగాంతం కాన్సెప్ట్ తో ఏం చేయబోతున్నారు.. హీరో దానిని ఎలా అడ్డుకోబోతున్నాడు అనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. అజయ్ ఘోష్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. చివర్లో కార్తికేయ.. ది శివశంకర్ వరప్రసాద్ షో బిగిన్స్ అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. చిరంజీవి పేరుని ఇక్కడ ఎందుకు ఉపయోగించారో మరి.