ఒక్క హిట్ అంటూ తపించిపోతున్నాడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100 తర్వాత ఆ రేంజ్ హిట్ మరలా పడలేదు. మరి బెదురులంక 2012 పరిస్థితి ఏంటీ. ఫస్ట్ డే వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం...  

హీరో కార్తికేయ లేటెస్ట్ మూవీ బెదురులంక 2012 ఆగస్టు 25న విడుదల చేశారు.రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన బెదురులంక 2012 కొంత హైప్ క్రియేట్ చేసింది. ప్రోమోలు ఆకట్టుకోగా ప్రేక్షకుల్లో ఒకింత ఆసక్తి నెలకొంది. ఈ మూవీ డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. హ్యూమర్ ఓ మేరకు వర్క్ అవుట్ అయ్యింది. కార్తికేయ, నేహాతో పాటు శ్రీకాంత్ అయ్యర్, కసిరెడ్డి, అజయ్ ఘోష్ పాత్రలు మెప్పించాయి. చివరి 30 నిమిషాలు చక్కని కథనంతో నవ్వులు పూయించాడు దర్శకుడు. 

ఇక ఫస్ట్ డే బెదురులంక వసూళ్లు పరిశీలిస్తే... ఏపీ/తెలంగాణాలలో రూ. 1.36 కోట్ల గ్రాస్, రూ. 70 లక్షల షేర్ అందుకుంది. నైజాంలో బెదురులంక రూ. 42 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. ఇక సీడెడ్ లో చూస్తే రూ. 23 లక్షలు వసూలు చేసింది. ఉత్తరాంధ్ర ఏరియాలో రూ. 20 లక్షల గ్రాస్ అందుకుంది. 

కర్ణాటకతో పాటు రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ రూ. 27 లక్షల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్ కార్తికేయ చిత్రం ఫస్ట్ డే రూ. 84 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. అయితే సెకండ్ డే ఓపెనింగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమాకు రెస్పాన్స్ పెరుగుతుంది. వీకెండ్ ముగిసే నాటికి వసూళ్లు మెరుగ్గా ఉంటాయని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ధన్యవాదాలని కార్తికేయ అన్నారు. ఇక బెదురులంక 2012 మూవీ హక్కులను రూ.4.10 లక్షల కోట్లకు అమ్మారు. అంటే రూ. 4.50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్. మరో మూడున్నర కోట్లు రాబడితే మూవీ క్లీన్ హిట్ అవుతుంది. ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకుడు. కార్తికేయకు జంటగా నేహా శెట్టి నటించింది.