జగన్ పాత్రలో కనిపించే హీరో ఎవరంటే..

hero karthi to play ys jagan in yatra movie
Highlights

వైఎస్సార్ కుమారుడు జగన్ పాత్రలో ఎవరు నటించబోతున్నారనే విషయంలో సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ తమిళ నటుడు కార్తీ ఈ పాత్ర పోషించబోతున్నారని సమాచారం. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. మార్కెట్ పరంగా జగన్ పాత్రలో కార్తీని తీసుకునే సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది

ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడిగా మహి.వి.రాఘవ్ వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి ఈ సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ బయోపిక్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏ నటులు ఎలాంటి పాత్రల్లో నటిస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది.

వైఎస్సార్ గా మమ్ముట్టి నటిస్తుండగా అతడి తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని,. వైఎస్సార్ కుమార్తె షర్మిలగా భూమిక నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వైఎస్సార్ కుమారుడు జగన్ పాత్రలో ఎవరు నటించబోతున్నారనే విషయంలో సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ తమిళ నటుడు కార్తీ ఈ పాత్ర పోషించబోతున్నారని సమాచారం.

ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. మార్కెట్ పరంగా జగన్ పాత్రలో కార్తీని తీసుకునే సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. తెలుగు, తమిళ భాషల్లో కార్తీకి మంచి క్రేజ్ ఉంది. అందుకే దాదాపు ఆయన్నే ఖరారు చేసే ఛాన్స్ ఉంది. ఈ విషయానికి సంబంధించి చిత్రబృందం నుండి అధికార ప్రకటన వెలువడనుంది. 

loader