సోషల్ మీడియాలో కోలీవుడ్ వర్గాలు ఓ స్పెషల్ ఫోటో విడుదల చేస్తున్నారు. సదరు ఫొటోల్లో కమల్ హాసన్, సూర్య, శివాజీ గణేశన్ లుక్స్ ఒకేలా ఉన్నాయి.  


శివాజీ గణేశన్ కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా వెలుగొందారు. అనంతరం ఆయన క్యారెక్టర్ రోల్స్ చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి హీరోల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. ఇక కమల్ హాసన్ శివాజీ గణేష్ తర్వాత జనరేషన్ హీరో అని చెప్పొచ్చు. శివాజీ గణేష్ తో కమల్ హాసన్ కి మంచి అనుబంధం ఉండేది. వీరిద్దరూ ఓ సందర్భంలో దిగిన ఫోటో అద్బుతంగా ఉంది. 

శివాజీ గణేష్, కమల్ హాసన్ ఫోటోని తలపించేలా కమల్ హాసన్, సూర్య ఓ ఫోటో దిగారు. శివాజీ గణేష్-కమల్ హాసన్ ఫొటోలో కమల్ బ్లాక్ షర్ట్ ధరించి ఉన్నారు. శివాజీ గణేశన్ వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు. అదే మాదిరి ఈ జనరేషన్ ఫోటోలో సూర్య బ్లాక్ షర్ట్ ధరించి ఉండగా కమల్ వైట్ టీ షర్ట్ లో ఉన్నారు. ఈ రెండు సందర్భాలకు సంబంధించిన ఫోటోలను కోలీవుడ్ ఫ్యాన్స్ జత చేసి వైరల్ చేస్తున్నారు. 

కమల్ హాసన్ భారీ హిట్ విక్రమ్ మూవీలో సూర్య గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే. క్లైమాక్స్ లో సూర్య ఐదు నిమిషాల రోల్ కేక పుట్టించింది. సినిమాకు రోలెక్స్ రోల్ హైలెట్ గా నిలిచింది. విక్రమ్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 410 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో సూర్యకు కమల్ హాసన్ రోలెక్స్ వాచ్ బహుమతిగా ఇచ్చాడు.