శ్రీలీల టాలీవుడ్ కి దొరికిన అదృష్టం... బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్
భగవంత్ కేసరి విజయం వైపు తీసుకెళుతుంది. వసూళ్లు స్టడీగా ఉన్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

భగవంత్ కేసరి సక్సెస్ మీట్ గ్రాండ్ గా నిర్వహించారు. బాలకృష్ణ, శ్రీలీల, అనిల్ రావిపూడి, థమన్ తో పాటు చిత్ర నిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. వేదికపై బాలకృష్ణ సుదీర్ఘంగా మాట్లాడాడు. ప్రేక్షకులకు, చిత్ర యూనిట్ కి దసరా శుభాకాంక్షలు చెప్పిన బాలయ్య... స్త్రీ సాధికారిత గురించి తెరకెక్కిన తన చిత్రం దసరా నవరాత్రి రోజుల్లో విడుదల కావడం గొప్ప అదృష్టం అన్నారు. సినిమాకు ప్రేక్షకుల నుండి దక్కుతున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపాడు.
చిత్ర యూనిట్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. దర్శకుడు అనిల్ రావిపూడి విభన్నమైన కథలు తెరకెక్కిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం. ఇంత కంటే ఎక్కువ పొగడకూడదు అన్నాడు. సంగీతం అందించిన థమన్ పై బాలయ్య ఆసక్తికర కామెంట్స్ చేశాడు. థమన్ సూపర్ ఫిగర్. మా కాంబినేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. థమన్ దెబ్బకు ఊపర్స్ కూడా బద్దలైపోతున్నాయి అన్నాడు.
హీరోయిన్ కాజల్ గురించి మాట్లాడాడు బాలకృష్ణ. చందమామ కాజల్ గుండ్రని చేప కళ్ళతో యూత్ ని చాలా కాలం ఊపేసింది. పెళ్లి చేసుకొని చిన్న గ్యాప్ తీసుకుంది. మా చిత్రంతో సత్యభామలా రీఎంట్రీ ఇచ్చింది. ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నాడు. అర్జున్ రామ్ పాల్ ని గురించి చెబుతూ, ముంబై నుండి నా దోస్త్ వచ్చాడని హిందీలో మాట్లాడు. ఆయన నేషనల్ అవార్డు విన్నర్. ఈ చిత్రానికి సొంతగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడని అన్నారు.
ఇక శ్రీలీల గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు బాలకృష్ణ. చిలిపి, గ్లామర్ రోల్స్, డాన్సులతో అలరిస్తున్న శ్రీలీల ఇలాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేయడం గొప్ప విషయం. శ్రీలీల అద్భుతంగా నటించింది. శ్రీలీల టాలీవుడ్ కి దొరికిన అదృష్టం అన్నాడు. మూవీలో నటించిన నటులు, పని చేసిన సాంకేతిక నిపుణులకు బాలయ్య ధన్యవాదాలు తెలిపాడు. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు. మానసిక వికాసం కూడా అని బాలయ్య చెప్పుకొచ్చాడు...