Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య మారిపోయాడు! ఈ వీడియో చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు!


హీరో బాలకృష్ణ మారిపోయాడంటూ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. తాజాగా ఓ వీడియో షేర్ చేసిన ఫ్యాన్స్ మా బాలయ్య బంగారం అంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
 

hero balakrishna has changed after watching this video you realizes ksr
Author
First Published Aug 27, 2024, 2:26 PM IST | Last Updated Aug 27, 2024, 2:26 PM IST

బాలయ్య టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. 50 ఏళ్ల ప్రస్థానం ఆయనది. మాస్ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. సుదీర్ఘ ప్రస్థానంలో యాక్షన్,కామెడీ, జానపద, సైన్స్ ఫిక్షన్, డివోషనల్... ఇలా పలు జోనర్స్ లో ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. ఆయన పేరిట అరుదైన రికార్డులు ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేశాడు. 

అయితే బాలయ్యలోని ఓ యాంగిల్ చాలా మందికి నచ్చదు. పబ్లిక్ లో ఆయన ప్రవర్తన పలుమార్లు వివాదాస్పదమైంది.  అభిమానులను కొట్టడం బాలయ్యకు ఉన్న మా చెడ్డ అలవాటు. లెక్కకు మించిన సందర్భాల్లో బాలయ్య కోపం కట్టలు తెంచుకుంది. జనాల్ని రోడ్డు మీద వెంబడించి తన్నిన సందర్భాలు కూడా ఉన్నాయి. సెట్స్ లో కూడా తన అసిస్టెంట్స్ మీద బాలయ్య చేయి చేసుకుంటారనే వాదన ఉంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ ఈ విషయాన్ని ధృవీకరించారు. 

బాలయ్యతో కే ఎస్ రవికుమార్ జై సింహా, రూలర్ చిత్రాలు చేశారు. నవ్వినందుకు అసిస్టెంట్ డైరెక్టర్ ని బాలయ్య కొట్టబోతే బ్రతిమిలాడి ఆపాను అని కే ఎస్ రవికుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. బాలయ్యకు అభిమానులు అంటే చాలా ఇష్టమని ఓ వర్గం వాదిస్తుంది. తాజాగా ఓ వీడియో షేర్ చేసిన బాలయ్య అభిమానులు మా హీరో గ్రేట్ అంటున్నారు. 

పర్యటనలో భాగంగా జనాల్లో సంచరిస్తున్న బాలయ్య వద్దకు మహిళా అభిమాని వచ్చింది. ఏకంగా ఆయన్ని ఆలింగనం చేసుకుంది. బాలయ్య ముఖాన్ని తాకి ప్రేమానురాగాలు ప్రదర్శించింది. ఆమె ప్రేమకు బాలయ్య ముగ్ధుడయ్యాడు. ఆప్యాయంగా నవ్వుతూ పలకరించాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది. మా బాలయ్య గ్రేట్ అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. 

ఇదిలా ఉంటే... బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ NBK 109 చేస్తున్నాడు. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుందని సమాచారం. విడుదలైన ప్రోమోలు ఆసక్తిరేపుతున్నాయి. బాలయ్య లుక్ అద్భుతంగా ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios