హీరో బాలకృష్ణ అమెరికా పర్యటనలో ఉన్నారు. తానా వేడుకల్లో పాల్గొంటున్నారు. కాగా అక్కడ తనను కలిసిన అభిమాని బర్త్ డే స్వయంగా నిర్వహించాడు.
నందమూరి హీరో బాలకృష్ణ అమెరికా వెళ్లారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA) వేడుకల్లో పాల్గొంటున్నారు. తానా సభ్యులు బాలయ్యను ప్రత్యేకంగా ఆహ్వానించారు. తానా వేడుకల్లో బాలయ్య తనదైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. కాగా ఓ అభిమాని బాలయ్య దంపతులను ప్రత్యేకంగా కలిశారు. తన పుట్టిన రోజు నాడు ఆశీసులు తీసుకునేందుకు వెళ్లారు. అభిమాని బర్త్ డే అని తెలిసిన బాలకృష్ణ వెంటనే కేక్ తెప్పించి సెలబ్రేట్ చేశాడు. బాలయ్య చూపిన వాత్సల్యానికి సదరు అభిమాని ఆకాశంలో తేలింది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా కానుకగా విడుదల కానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల కీలక రోల్ చేస్తుంది.
అలాగే బాలయ్య 109వ చిత్ర షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ సారథి స్టూడియోలో మొదలుకానుందట. సారథి స్టూడియోలో ప్రత్యేకమైన సెట్ వేశారట. బాలయ్యపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. వాల్తేరు వీరయ్య విజయంతో బాబీ, వీరసింహారెడ్డి హిట్ తో బాలకృష్ణ ఊపుమీదున్నారు. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి.
