పెళ్లయ్యాక బోల్డ్ రోల్స్, ఐటెం సాంగ్స్ చేయడం చిన్న విషయం కాదు. ఆ సాహసానికి పూనుకుంది సయేశా సైగల్. కోలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ అవుతుంది.
అఖిల్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది సయేశా సైగల్. దిలీప్ కుమార్, సైరా భానులకు సయేశా వారసురాలు. అఖిల్ హీరోగా దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీ నిరాశపరిచింది. ఆ దెబ్బతో సయేశా మళ్ళీ తెలుగులో అడుగుపెట్టలేదు. కోలీవుడ్ లో సెటిలైన ఈ యంగ్ బ్యూటీ అక్కడ వరుస చిత్రాలు చేశారు. ఈ క్రమంలో హీరో ఆర్యతో ప్రేమలో పడింది. తనకంటే వయసులో చాలా పెద్దవాడైన హీరోని ప్రేమించి వార్తలకు ఎక్కింది.
ఇష్టపడిందే తడవుగా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుంది. 2019లో ఆర్య-సయేశా వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి సంతానం. ఆడపడదా చిత్రాలు చేస్తూ నెట్టుకొస్తున్న సయేశా పెద్ద సాహసం చేశారు. ఆమె ఏకంగా ఐటెం నెంబర్ కి సైన్ చేశారు. హీరో శింబుతో హాట్ హాట్ స్టెప్స్ వేశారు.

శింబు హీరోగా దర్శకుడు ఒబెలి ఎన్ కృష్ణ 'పత్తు తల' టైటిల్ తో చిత్రం చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సయేశా ఐటెం సాంగ్ చేశారు. అందుకు గాను ఆమె భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. నిర్మాతలు సయేశాకు రూ. 40 లక్షలు చెల్లించినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మిగతా హీరోయిన్స్ పారితోషికంతో పోల్చితే ఇది తక్కువే. అయితే ఆమెకున్న మార్కెట్ నేపథ్యంలో భారీ అమౌంట్ అని చెప్పొచ్చు.
పత్తు తల మూవీలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 30న పత్తు తల విడుదలైంది. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
