టాలీవుడ్ లో ఓ పెద్ద కుటుంబానికి చెందిన హీరో ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు తన భార్యకి దూరంగా ఉంటున్నాడని టాక్. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఇటీవల కాలంలో ఒక్క హిట్టు అందుకున్న దాఖలాలు కూడా లేవు.

వరుసగా ఫ్లాప్ లు రావడంతో ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నాడు. వచ్చే ఏడాదిలో ఓ సినిమాలో నటించే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా ఈ హీరోకి తన భార్యకి మధ్య కొన్ని విభేదాలు రావడంతో ఆమె దూరంగా వెళ్ళిపోయిందట.ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు బయటకి పొక్కాయి.

ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సదరు హీరో తన భార్య బాగానే ఉంటున్నానని తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ పరిస్థితులు మాత్రం అలా లేవని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ హీరోతో తన భార్య దూరంగా ఉంటోంది. ఇకరీసెంట్ గా హీరో గారి భార్య తనకి సంబంధించిన వస్తువులను తీసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయిందని టాక్. మరి తిరిగి ఇద్దరూ కలుసుకుంటారో లేక విడాకులు తీసుకుంటారో చూడాలి!