బ్లాక్ బస్టర్ జవాన్ పై అల్లు అర్జున్ ట్వీట్... ఇంత ఎగ్జైట్ అయ్యారేంటి!
జవాన్ మూవీ ట్రెమండస్ సక్సెస్ కాగా అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. చిత్ర యూనిట్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ సుదీర్ఘ ట్వీట్ వైరల్ అవుతుంది.
షారుఖ్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జవాన్. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 650 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. పఠాన్, జవాన్ చిత్రాలతో అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడు. నయనతార హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి విలన్ రోల్ లో అలరించారు. దీపికా పదుకొనె అతిథి పాత్రలో తళుక్కున మెరిసింది. ప్రియమణి కీలక రోల్ చేసింది.
జవాన్ సక్సెస్ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సైతం షారుఖ్ ఖాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ బాబు, రాజమౌళి జవాన్ యూనిట్ ని కొనియాడుతూ ట్వీట్స్ వేశారు. తాజాగా ఈ లిస్ట్ లో హీరో అల్లు అర్జున్ చేరారు. అల్లు అర్జున్ సుదీర్ఘంగా జవాన్ యూనిట్ ని పొగడ్తలతో ముంచెత్తారు. భారీ విజయం సాధించిన జవాన్ యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు. షారుఖ్ మాస్ అవతార్ ఎంటైర్ ఇండియాను ఫిదా చేసింది. ఎంతో ఆనందంగా ఉంది సార్. దీని కోసం మేము ప్రార్థనలు చేశాం.
ఎప్పటిలాగే విజయ్ సేతుపతి అద్భుత పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. దీపికా పదుకొనె ప్రెజెన్స్ ఎంతో ప్రభావంతంగా ఉంది. ఈ సినిమాతో నయనతార నేషనల్ వైడ్ సత్తా చాటింది. అనిరుధ్ తన మ్యూజిక్ తో దేశాన్ని ఊపేశావు... ఇక దర్శకుడు అట్లీకి శుభాకాంక్షలు. ఎంటర్టైనింగ్ కమర్షియల్ మూవీతో బాక్సాఫీస్ షేక్ చేసి గర్వపడేలా చేశావు... అని అల్లు అర్జున్ తన ట్వీట్లో రాసుకొచ్చాడు.
కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేయాల్సి ఉండగా రిజెక్ట్ చేశాడనే వాదన ఉంది. కాగా నెక్స్ట్ అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నాడనే పుకార్లు వినిపిస్తున్నాయి. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో ళ్లు అర్జున్ మూవీ చేస్తారు. అనంతరం అల్లు అర్జున్-అట్లీ మూవీ ఉండే అవకాశం ఉంది...