ప్రముఖ సినీ నటుడు, స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కార్‌వాన్ ప్రమాదానికి గురైంది. ఖమ్మం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటున్నారు. అయితే ఆ వాహనంలో మేకప్ టీమ్ వున్నట్లుగా తెలుస్తోంది. కార్‌వాన్‌లో అల్లు అర్జున్ లేడని చిత్ర యూనిట్ ప్రకటించింది. రంపచోడవరంలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని మూవీ యూనిట్ తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా ఆ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి చిత్ర యూనిట్ ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.