టాలీవుడ్‌ హీరో అడివి శేషు.. ఆసుపత్రి కోసం మరో సాయం అందించారు. దాదాపు 300మందికిపైగా  కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఈ ఆసుపత్రికి శాశ్వత వాటర్‌ ప్లాంట్‌ని ఏర్పాటు చేయించారు. 

కోటీ ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి నీటి కొరత వేధిస్తుందనే వార్తలు వినిపించిన నేపథ్యంలో దాదాపు రోగుల సహాయార్థం ఇటీవల 865లీటర్ల డ్రింకింగ్‌ వాటర్‌ బాటిల్స్ ని పంపించి వార్తల్లో నిలిచిన టాలీవుడ్‌ హీరో అడివి శేషు.. ఆసుపత్రి కోసం మరో సాయం అందించారు. దాదాపు 300మందికిపైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఈ ఆసుపత్రికి శాశ్వత వాటర్‌ ప్లాంట్‌ని ఏర్పాటు చేయించారు. 

తన సొంత ఖర్చుతో నీటి శుద్ధీకరణ వ్యవస్థ(వాటర్‌ ప్యూరిఫికేషన్‌) సిస్టమ్‌ని ఏర్పాటు చేయించారు. ఈ ప్లాంట్‌ ద్వారా గంటకి వెయ్యి లీటర్ల నీటిని శుద్ధి చేస్తుంది. ఆసుపత్రి సిబ్బందికి, రోగులకు తాగునీటి సమస్యని పూర్తిగా ఇది పరిష్కరిస్తుంది. జనరల్‌గా సెలబ్రిటీలు సమస్యకి తాత్కాలిక పరిష్కారం చూపిస్తుంటారు. కానీ అడివి శేష్‌ మాత్రం శాశ్వత పరిష్కారాన్ని అందించి ఈ క్లిష్ట సమయంలో కరోనా రోగులకు తన వంతు సాయం అందించారు. చాలా కాలంగా ఉన్న నీటి సమస్యని పరిష్కరించడంతో సుపత్రి వర్గాలు, డాక్టర్లు శేషుకి ధన్యవాదాలు తెలియజేశారు.

అడివి శేష్‌ ప్రస్తుతం `మేజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. శశికిరణ్‌ తిక్క దర్శకుడు. దీన్ని సోనీ పిక్చర్స్, జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ పతాకాలపై మహేష్‌బాబు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు `హిట్‌` సీక్వెల్‌ చిత్రంలోనూ నటిస్తున్నారు అడివి శేష్‌.