సైమా 8వ అవార్డుల వేడుకకు రంగం సిద్ధం అవుతోంది. ఆగష్టు ఆగష్టు 15, 16న సైమా అవార్డ్స్ వేడుకని ఘనంగా నిర్వహించనున్నారు. ఫాంటలూన్స్ సంస్థ ఈ వేడుకని స్పాన్సర్ చేస్తోంది. ఇటీవల సైమా అవార్డ్స్ వేడుకకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ ఫాంటలూన్స్ సంస్థ మీడియా సమావేశం నిర్వహించింది. 

ఈ సమావేశంలో హీరోయిన్ శ్రీయ శరన్. సుధీర్ బాబు, రుహాని శర్మ, నిధి అగర్వాల్, ఫాంటలూన్స్ మార్కెటింగ్ హెడ్ ర్యాన్ పాల్గొన్నారు. సౌత్ ఇండియా సినీ తరాల సమక్షంలో వైభవంగా సైమా అవార్డ్స్ జరగబోతున్నాయి. ఈ సారి సైమా అవార్డ్స్ కు నామినేట్ అయిన చిత్రాల మధ్య మంచి పోటీ నెలకొని ఉంది. 

తెలుగులో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం టాప్ లో కొనసాగుతోంది. ఈ చిత్రానికి మహానటి గట్టి పోటీ ఇస్తోంది. ఇక తమిళంలో త్రిష నటించిన 96 టాప్ లో ఉంది. కన్నడలో కేజీఎఫ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

తెలుగులో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన చిత్రాలు : 

1. రంగస్థలం - 12 నామినేషన్స్ 

2. మహానటి - 9 నామినేషన్స్ 

3. గీతా గోవిందం - 8 నామినేషన్స్ 

4. అరవింద సమేత - 6 నామినేషన్స్