మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనేందుకు చరణ్ ఇటీవల యుఎస్ వెళ్లారు. అలాగే హెచ్ సి ఏ అవార్డ్స్ వేడుకలో కూడా పాల్గొన్నారు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనేందుకు చరణ్ ఇటీవల యుఎస్ వెళ్లారు. అలాగే హెచ్ సి ఏ అవార్డ్స్ వేడుకలో కూడా పాల్గొన్నారు. రాంచరణ్ కి ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంది.
అమెరికాలో రాంచరణ్ వివిధ వేదికలపై సూపర్ స్టైలిష్ గా కనిపించారు. రాంచరణ్ లుక్ అక్కడ హాలీవుడ్ వారిని కూడా ఆకర్షించింది. స్టైల్ గా సూట్ ధరించి రాంచరణ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. రాంచరణ్ ధరించిన ప్రతి సూట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
దీనితో రాంచరణ్ ధరించిన సూట్ ప్రత్యేకత ఏంటి.. ఆ సూట్ ఏ డిజైనర్ తయారు చేశారు.. ధర ఎంత అనే చర్చలు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. అయితే చరణ్ ధరించిన షూట్స్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ వేదికలపై చరణ్ కనిపించేందుకు చెన్నైలోని ప్రముఖ డిజైనర్ దగ్గర ఈ షూట్స్ ప్రత్యేకంగా తయారు చేయించారట.

వాటి ధర ఒక్కొక్కటి 10 లక్షల నుంచి రూ 75 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. వీటి ధర తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా రాంచరణ్ ఈ షూట్స్ ధరించి రాయల్ లుక్ లో అందరిని ఆకర్షించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం రాంచరణ్ కి గ్లోబల్ గా గుర్తింపు తెచ్చిపెడుతోంది. త్వరలో ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయి. నాటు నాటు సాంగ్ కనుక ఆస్కార్ అవార్డు గెలిస్తే అంతర్జాతీయంగా రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పేర్లు మారుమోగడం ఖాయం.
