ప్రపంచం మొత్తం క్రిస్మస్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటుండగా మన టాలీవుడ్ స్టార్ తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు పంచాలని, సక్సెస్ అండ్ జాయ్ చేకూర్చాలని కోరుకున్నారు.చిరంజీవి, ఎన్టీఆర్ ,మహేష్ వంటి స్టార్స్ క్రిస్మస్ ట్వీట్స్ చేయగా వైరల్అవుతున్నాయి . 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదిక అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి ఆనందకర క్రిస్మస్ అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. 

ఇక మెగాస్టార్ చిరంజీవి తన ఫెస్టివల్ లుక్ పంచుకోవడంతో పాటు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ ట్రీ పక్కన ఫోజులిస్తూ ఆయన అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేశారు.

 
సూపర్ స్టార్ మహేష్ సైతం సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ విషెష్ తెలియజేశారు. తన ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార క్రిస్మస్ వేడుకలకు సంబందించిన ఫోటోలు ఆయన షేర్ చేశారు. 


ఇక అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఫోటో ట్విట్టర్ లో షేర్ చేశారు. అలాగే తన అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. 


మరో మెగా హీరో రామ్ చరణ్ కూడా క్రిస్మస్ విషెష్ తెలియజేశారు. మిత్రులు, కుటుంబ సభ్యులతో క్రిస్మస్ పార్టీకి సంబంధించిన ఫోటోలు ఆయన షేర్ చేశారు.