సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఎపిసోడ్ 4లోకి ఎంటర్ అయ్యారు. మొదటి ఎలిమినేషన్ కూడా నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ ఇంటి సభ్యులు మొత్తం ఇంటిలో సందడి చేస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో చెప్పుకోదగ్గ హైలైట్స్ ఏమి లేవని చెప్పాలి. 

ఐతే పొరిగింటి ఇంటి సభ్యులు టాస్క్ కోసం, బిగ్ బాస్ మొత్తం ఇంటి సభ్యులలో ఇద్దరు కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ మిగతా సభ్యులకు పరిచయం చేయకుండా ఓ గదిలో ఉంచారు. సోహైల్, ఆరియానాలను ఈ టాస్క్ కోసం బిగ్ బాస్ ఎంచుకోవడం జరిగింది. రెండు రోజులుగా ఆ గదిలోనే ఉంటూ మిగతా ఇంటి సభ్యుల గేమ్ పరిశీలిస్తున్నారు. ఐతే వీరిద్దరూ ఆహారం మిగతా ఇంటి సభ్యులను ఫోన్ ద్వారా అడిగి తెప్పిచుకోవాలి. 

కాగా పొరుగింటిలో ఉన్న ఆరియానా, సోహైల్ అడిగిన ఫుడ్ ఇంటి సభ్యులు ఇవ్వలేదు. వారు చెప్పే విషయం వినకుండా నోయల్ ఫోన్ కట్ చేయడంతో ఆరియానా, సోహైల్ కి ఫుడ్ లేకుండా పోయింది. దీనితో బిగ్ బాస్ వీరిద్దని వెళ్లి ఇంటి సభ్యులతో తేల్చుకోమని చెవుతాడు. 

ఇంటిలోకి ఎంటర్ అవుతూనే పరిచయ కార్యక్రమాలు కూడా లేకుండా వీరిద్దరూ తమకు అడిగిన ఫుడ్ ఎందుకు ఇవ్వలేదని ఇంటి సభ్యులను అడిగారు. ముఖ్యంగా నోయల్ ని ఫోన్ ఎందుకు కట్ చేశారు, దానివలన మేము రెండు రోజులు ఫుడ్ తినలేదని ఆవేదన పడ్డారు. నోయల్ ని సోహైల్ తప్పుబట్టగా అతను పరిస్థితి వివరించారు. ఈ క్రమంలో అభిజిత్ మరియి సోహైల్ మధ్య వాగ్వాదం నడిచింది. 

ఇక ఆరియానా తనకు ఎవరైనా ఫుడ్ తినిపించాలని, తన ముఖంలో చిరు నవ్వు ఉండాలని కోరింది. ఇంటి సభ్యులు ఇది టాస్క్ లో భాగం అని ఎవరూ సాహసం చేయలేదు. ఐతే అఖిల్ ఆ బాధ్యత తీసుకున్నాడు. దీనికి అభిజిత్ అఖిల్ ని ఆట పట్టించారు. నోయల్ ఆమెకు ఎందుకు ఫుడ్ తినిపించావ్ అని అడుగగా, నాకు ఎవరూ ఇంతవరకు తినిపించలేదని అందుకే నేను తనకు తినిపించానని ఎమోషనల్ అయ్యారు. 

ఇక లాస్య, హారిక మరియు గంగవ్వల మధ్య సరదా సంభాషణలు నడిచాయి. గంగవ్వ చిన్న విషయమై ఆరియానాను విసుక్కోవడం జరిగింది. కాగా రేపు ఎపిసోడ్ నందు ఇంటి సభ్యుల మధ్య ఫిజికల్ టాస్క్ లు మొదలుకానున్నాయని ప్రోమో ద్వారా తెలుస్తుంది.