ప్రముఖ సినీ నటుడు గిరీష్ కర్నాడ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. కన్నడ నటుడైనప్పటికీ తెలుగులో కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రంగస్థల నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన తన కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు.

అతడి వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలు దాగున్నాయి. దానిలో గిరీష్ కర్నాడ్, బాలీవుడ్ నటి హేమామాలినిల వివాహ ప్రస్తావన కూడా ఉంది. హేమామాలిని 70వ దశాబ్దంలో ఇండస్ట్రీలో అత్యంత అందగత్తెగా పేరు సంపాదించుకుంది. స్టార్ హీరోలంతా కూడా ఆమె అభిమానులుగా మారిపోయారని చెబుతుంటారు.

అయితే హేమామాలిని తల్లి తన కుమార్తెను గిరీష్ కర్నాడ్ కు ఇచ్చి వివాహం  చేయాలని భావించారట. ఈ విషయమై ఆమె గిరీష్ కర్నాడ్ ని సంప్రదించారు కూడా.. అయితే హేమామాలి మాత్రం ధర్మేంద్రని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పడంతో గిరీష్ తో పెళ్లి ఆగిపోయింది.

ఆ తరువాత హేమామాలిని.. ధర్మేంద్రని వివాహం చేసుకొంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో గిరీష్ కర్నాడ్ హేమామాలిని గురించి మాట్లాడుతూ ఆమెని ఎంతో గౌరవిస్తానని చెప్పారు.  ఆమె ఒక మంచి నటి అని, అయితే రాజ్యసభ సభ్యురాలిగా ఆమె విఫలమయ్యారని చెప్పారు.