Asianet News TeluguAsianet News Telugu

సెల్ఫీ అడిగితే ఇంత కోపమా.. హేమా మాలినిపై మండిపడుతున్న నెటిజన్లు..

ఓ అభిమానిపై మండిపడింది బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని. అంతలా కోపడటానికి అతనేమి నేరం చేయలేదు. ఆమెను ఏమీ అనలేదు. అభిమానత తార కాబట్టి ఓ ఫోటో గ్రాఫ్అడిగాడు. దాంతో ఆమె ఏమన్నారో తెలుసా..? 
 

Hema Malini gets annoyed by fans lining up for the pic at an event JMS
Author
First Published Jan 12, 2024, 7:34 AM IST

సెల‌బ్రిటీలు, సినిమా తారలు కనిపిస్తే.. ఫోటోలు దిగాలి అనిపించడం సహజం, అది చాలా సాధార‌ణ విషయం. అయితే జనాలు ఎక్కవగా ఉండి.. సెలబ్రిటీని ఇబ్బంది పెట్టడం మాత్రంతప్పు. కాని ఖాళీ టైమ్ లో.. అభిమానులుఅడిగిన ఫోటోలు, ఆటోగ్రాఫ్ లు కాదనకుండా ఇస్తుంటారు స్టార్స్. కొంత మంది సెలబ్రిటీలు అయితే అభిమానులు చిన్నబుచ్చుకోకుండా.. ఎంత బిజీగా ఉన్నా.. కాదనకుండా ఫోటోలు దిగుతారు. అడిగినవారికి సెల్ఫీలు ఇవ్వడంతో పాటు ఆటోగ్రాఫ్ లుకూడా ఇస్తుంటారు. సహనం ఎక్కువ ఉన్న స్టార్లు ఇలా చేస్తుుంటారు. 

కాని కొంత మంది మాత్రంఎంత ఖాళీగా ఉన్నా.. అభిమానులు దగ్గరకు వస్తేచిరకు పడటం. వారిపట్ట అమానుషంగం బిహేవ్ చేయడం. నెట్టివేయడం, చీప్ గా చూడటం లాంటివి చేస్తుంటారు. అభిమానుల వల్ల వాళ్ళు ఈస్టేజ్ లో ఉన్నారన్న సంగతి మర్చిపోయి. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. అలాంటివారిలో బాలీవుడ్ డ్రీమ్ గళ్ల్ హేమామాలిని కూడా ఒకరు. తాజాగా ఆమె అకారణంగా ఓ అభిమానిని అవమానకరంగా మాట్లాడి బాధపెట్టారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..? 

హేమా మాలినీ అన్న మాట వింటే.. మరోసారిసెల్ఫీ అడగకుండా ముఖం మీదే ఓ మాట అనేసింది సీనియర్ తార. రీసెంట్ గా ముంబయ్ లో..ప్రముఖ రచయిత గుల్జార్ బయోగ్రఫీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ  ఈవెంట్ కు హేమా మాలినీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ అభిమాని హేమమాలినీని సెల్ఫీ ఇవ్వాలని అడిగాడు. అందుకు ఆమె చిరాకుగా ఫేస్ పెట్టి..  `నీకు సెల్ఫీ ఇవ్వడానికి కాదు ఇక్కడకు వచ్చింది` అని అస‌హ‌నంగా మాట్టాడారు. దాంతో ఆఅభిమాని చిన్నబుచ్చుకన్నారు. 

దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు  ఆమెపై మండిప‌డుతున్నారు. `సెల్ఫీ అడిగితే ఇంత పొగరుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. కొన్ని కోట్ల మంది అభిమానిస్తే స్టార్ అయ్యారు. ఆ హోదాని ఆస్వాది స్తున్నారు. అలాంటి అభిమాని సెల్పీ అడిగితే ఏమాత్రం గౌర‌వించ‌కుండా ..అగౌవ‌ర‌ప‌ర‌చ‌డం అన్న‌ది ఎంత‌వ‌ర‌కూ న్యాయ‌మో ఆమె ఆలోచించుకోవాల‌ని నెటి జ‌నులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. 

అసలు  అక్కడ పెద్దగా జనాలు లేరు. ఎవరూ ఆమెను ఇబ్బంది కూడా పెట్టలేదు. అయినా అంత అసహనం ఎందుకుప్రదర్శించారో  ఎవరికీ అర్ధం కాలేదు. ప్రస్తుతం ఆమె ట్రెండింగ్ స్టార్ కాదు. ఎప్పుడో పాతకాలపు హీరోయిన్.. ఇప్పుడున్న స్టార్ల క్రేజ్ ముందు అసలు ఆమెను  ఎవరూ సెల్ఫీ అడిగేవారు ఉండరు. అయినా అభిమానంతో సెల్ఫీ అడిగితే.. అంత మాట అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనాలు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios