బిగ్ బాస్ షో సెన్సార్ చేయాల్సిందే అంటూ కేతిరెడ్డి కోర్టును ఆశ్రయించగా కంటెస్టెంట్స్ గా ఫైనల్ చేసి చివరి నిమిషంలో మోసం చేశారని పలువురు నటీమణులు ఆరోపించారు. 

అసలు విషయంలోకి వెళితే.. ఈ విషయంపై నటి హేమ స్పందించారు. బిగ్ బాస్ షో పై అనవసరంగా వివాదాలు క్రియేట్ చేయవద్దని అక్కినేని నాగార్జున ఒక మంచి ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అంటూ... వివాదాల డోస్ ఏ మాత్రం పెరిగినా ఆయన షోలో అడుగు పెట్టరని మాట్లాడారు. ఇక తన రాజకీయ ప్రస్తావన కూడా మళ్ళీ పట్టాలెక్కనున్నట్లు హేమ వివరించారు.

గతంలో ఆమె కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇక నుంచి రెగ్యులర్ పాలిటిక్స్ లో ఉంటానని హేమ తెలిపారు. అయితే వివాదాల డోస్ ఎంత పెరుగుతున్నా ఇంత వరకు నాగార్జున నుంచి సరైన క్లారిటీ రాలేదు. ఆయన భవిష్యత్తులో ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.