టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి చెక్కేద్ద‌మ‌ని అనుకుంటున్న హెబ్బా ప‌టేల్ ఇలియాన కాజ‌ల్ త‌మ‌న్నలాగ హింది సినిమాల్లో న‌టించాల‌ని చూస్తున్న బ్యూటి
నిజానికి టాలీవుడ్ లో హెబ్బాకు బ్లాక్ బస్టర్ మూవీస్ లేవు. కుర్రహీరోలతో ఓ మోస్తరు హిట్స్ మాత్రమే కొట్టింది. నటిగా ఆమె ఎక్కాల్సిన మెట్లు చాలానే ఉన్నాయి. ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ విషయంలో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. హెబ్బా మాత్రం ఇప్పటివరకు సంపాదించిన అనుభవం తనకు చాలంటోంది. కుదిరితే ఈ ఏడాదే బాలీవుడ్ లో అడుగుపెట్టాలని తహతహలాడుతోంది. ఈ మేరకు తనకు తెలిసిన బాలీవుడ్ సర్కిల్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటోందట.
ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా త్వరలోనే బ్రేకింగ్ న్యూస్ చెబుతానంటూ ఊరించింది ఈ చిన్నది. ఆ బ్రేకింగ్ న్యూస్ బాలీవుడ్ సినిమా అవకాశమే అయి ఉండొచ్చని టాక్. అయినా హిందీ చిత్రసీమకు వెళ్లిన ఇలియాన, తాప్సి లాంటి తారల కెరీర్ ఏమైందో అందరికీ తెలిసిందే. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి కూడా ఇంకా బాలీవుడ్ కలలుకంటున్న హెబ్బాను ఏమనాలి..
