Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss5 హౌజ్‌ని ఓ ఊపు ఊపేసిన హేబా పటేల్‌.. కూతురు బెస్ట్ అని చెప్పి రవి టీమ్‌

హాట్‌ హీరోయిన్‌ హేబా పటేల్‌ మాస్‌ డ్యాన్స్ తో దుమ్ములేపింది. ఆడియెన్స్ మెస్మరైజ్‌ చేసింది. బిగ్‌బాస్‌5 షోకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. `నవరాత్రి ` స్పెషల్‌ బిగ్‌బాస్‌5 ఆదివారం ఎంటర్‌టైన్‌మెంట్స్ ని పంచుతుందని చెప్పొచ్చు. 

heba patel shake bigg boss5 house with her mass item number
Author
Hyderabad, First Published Oct 10, 2021, 7:40 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌బాస్‌5 నవరాత్రి స్పెషల్‌ ఈవెంట్‌లో ఇంటిళ్లిపాదిని ఆద్యంతం అలరిస్తుంది. ఇందులో హాట్‌ బ్యూటీ హేబా పటేల్‌ సందడి చేసింది. స్పెషల్‌ సాంగ్‌లో ఆమె తన ఘాటైన అందాలతో, మాస్‌ డ్యాన్స్ తో దుమ్ములేపింది. ఆడియెన్స్ మెస్మరైజ్‌ చేసింది. షోకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. `నవరాత్రి ` స్పెషల్‌ బిగ్‌బాస్‌5 ఆదివారం ఎంటర్‌టైన్‌మెంట్స్ ని పంచుతుందని చెప్పొచ్చు. 

ఇక రవి టీమ్‌, ప్రియా టీమ్‌ల మధ్య నిర్వహించిన డ్రామా స్కిట్‌ సైతం ఆద్యంతం ఎంటర్‌టైన్‌ చేసింది. ఎమోషనల్‌గా సాగే రెండు టీమ్‌ల స్కిట్‌లు ఆడియెన్స్ హృదయాలను బరువెక్కించాయి. రవి టీమ్‌ కూతురు ప్రాధాన్యతని తెలిపేలా, కూతురు భారం కాదనే డ్రామాని ప్లే చేశారు. ఇందులో లోబో, ప్రియాంక భార్యాభర్తలుగా, లోబో బాబుని కోరుకోగా, ప్రియాంక కూతురుకి జన్మనిచ్చింది. దీంతో భార్యని వదిలేస్తాడు లోబో. ఆ తర్వాత ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని కూతురుని ప్రయోజకురాలు చేస్తుంది. 

మంచి కంపెనీలో ఉద్యోగంలో చేర్పిస్తుంది. అదే కంపెనీలో తండ్రి అయిన లోబో ఆఫీస్ బాయ్‌గా చేయడం, ఆ సమయంలో కూతురుని ప్రియాంక కలుసుకోవడం, అక్కడే లోబో ఉండటంతో తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకుని పాశ్చాత్తాపం చెందడం ఆకట్టుకుంది. వినోదం, ఎమోషనల్‌ మేళవింపుగా సాగింది. 

మరోవైపు ప్రియా టీమ్‌ రైతు కష్టాలను, వారి ఎమోషన్స్ ని చూపించారు. విశ్వ, ప్రియా రైతు జంటగా నటించగా, ప్రియాకి కళ్లు లేవు. పంటలు సరిగ్గా పండక అప్పుల పాలు అవుతారు. మానస్‌, సిరి పిల్లలు. వారి చదువుల కోసం డబ్బు అవసరం అవుతుంది. వారి ఒత్తిడి మేరకు భూమి అడ్డికి పావుషేరులా అమ్ముతారు. అది భరించలేక రైతు విశ్వ చనిపోతాడు. దీంతో తాము ఎంత తప్పు చేశామో తెలుసుకుంటారు సిరి, మానస్‌. ఆ తర్వాత తనకు సీటీలో పెద్ద జాబ్‌ వచ్చినా వదులుకుని తండ్రి లాగే తాను రైతు అవుతానని చెప్పడం ఈ డ్రామా సారాంశం. 

also read:Bigg Boss5 నవరాత్రి స్పెషల్‌.. కూతురుని ముద్దు ముద్దు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న లోబో..

అయితే ఇందులో ఎమోషన్‌ ఎక్కువ ఉందని, ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదని, అంతోకుంతో రవి టీమ్‌ డ్రామా బాగా పండిందని, వారికి అవార్డు ఇచ్చారు నాగ్‌. నవరాత్రలు సందర్భంగా ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ 9 అవార్డులు ఇస్తున్నారు. మొదటి టాస్క్ లో ప్రియా టీమ్‌ విన్నర్‌గా నిలిచి అవార్డు అందుకుంది. రెండో గేమ్‌లో రవి టీమ్‌ గెలుచుకున్నారు. మూడో గేమ్‌లో రవి టీమ్‌, పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పే గేమ్‌లో ప్రియా టీమ్‌ విన్నర్‌గా నిలిచారు. 

ఈ గేమ్‌లు గెలుపొందిన కారణంగా అనీ మాస్టర్‌, యాంకర్‌ రవి, విశ్వలకు తమ ఫ్యామిలీ వీడియోలను చూపించారు. అనీ మాస్టర్‌ ఫ్యామిలీ అందరు మాట్లాడారు. ఆమె ఆట తీరుని అభినందించారు. బాగా ఆడాలని తెలిపారు. దీంతో అనీ మాస్టర్‌ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక రవి ఫ్యామిలీ వీడియోలో ఆయన భార్య, కూతురు మాట్లాడారు. కూతురు మాటలకు రవి కన్నీళ్లు పెట్టుకోవడం కదిలించింది. రవి కన్నీళ్లకి నాగార్జున కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక నామినేషన్లలో ఉన్న వారిలో ఇప్పటికే మానస్‌, జెస్సీ సేవ్‌ అవ్వగా, మరో సారి నామినేషన్లని సేవ్‌ చేసే ప్రక్రియలో రవి, ప్రియా సేవ్‌ అయ్యారు. 

also read: తన అనారోగ్య సమస్యని బయటపెట్టి షాకిచ్చిన యాంకర్‌ సుమ.. మేకప్‌ కష్టాలు..

Follow Us:
Download App:
  • android
  • ios