లెజండరీ డైరెక్టర్ మణిరత్నంకి గుండెపోటు!

First Published 26, Jul 2018, 4:29 PM IST
heart stroke to legendary director mani ratnam
Highlights

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మణిరత్నం పేరు తెలియని వారుండరు. ఆయన సినిమాల్లో ఒక్క అవకాశమొస్తే చాలని కోరుకునే హీరోలు కోకొల్లలు. గీతాంజలి, రోజా, బొంబాయి ఇలా ఆయన ఏ సినిమా తీసినా అద్భుతమే

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మణిరత్నం పేరు తెలియని వారుండరు. ఆయన సినిమాల్లో ఒక్క అవకాశమొస్తే చాలని కోరుకునే హీరోలు కోకొల్లలు. గీతాంజలి, రోజా, బొంబాయి ఇలా ఆయన ఏ సినిమా తీసినా అద్భుతమే.. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరించే మణిరత్నం కొన్నాళ్లుగా హిట్ సినిమా కోసం పరితపిస్తున్నారు.

మధ్యలో 'ఓకే బంగారం' వంటి సినిమా తీసినా.. ఆ తరువాత తెరకెక్కించిన 'చెలియా' నష్టాల్నే మిగిల్చింది. ప్రస్తుతం ఆయన తమిళంలో స్టార్ హీరోలతో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే సడెన్ గా ఈరోజు మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో వెంటనే ఆయనను చెన్నై అపోలో హాస్పిటల్ కు తరలించారని సమాచారం. వైద్యులు మణిరత్నానికి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు సడెన్ గా ఇలా జరగడంతో అభిమానులు షాక్ లో ఉన్నారు. ఆయన తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.   

loader