రీసెంట్ గానే కదా.. తను రచించిన పుస్తకం ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంది.. ఇంతలో రేణుదేశాయ్ కి ఏమైందని అనుకుంటున్నారా..? ఆమె ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా వాళ్లకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా.. అభిమానుల్లో హాట్ టాపిక్. 

అందుకే సినీ సెలబ్రిటీల జీవితాలపై మీడియా ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కి సంబంధించి ఓ వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదేంటంటే రెండు ఆరోగ్యం సరిగ్గా లేదట.. ఆ కారణంగానే ఆమె ఓ సినిమా కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల ఓ నిర్మాత తన సినిమాల తల్లి పాత్ర కోసం రేణుని తీసుకోవాలని ఆమెని సంప్రదించారట. రేణు రీఎంట్రీ ఇస్తే తన సినిమాకి అదనపు ఆకర్షణ అని భావించాడు సదరు నిర్మాత. రేణుకి కూడా ఆ నిర్మాతతో మంచి రిలేషన్ ఉంది.

మొహమాటానికైనా ఆయనతో పని చేసే పరిస్థితి ఉంది. కానీ తన ఆరోగ్యం బాగాలేక రేణు నో చెప్పినట్లు  తెలుస్తోంది. కొన్నాళ్లు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పడంతో సదరు నిర్మాత కూడా తన ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది.