అంతర్జాతీయ వేదికలపై రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రభంజనం ఆగడం లేదు. ఏ ఈవెంట్ కి వెళ్లినా అవార్డులు ఆర్ఆర్ఆర్ టీంకి దాసోహం అవుతున్నాయి.

అంతర్జాతీయ వేదికలపై రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రభంజనం ఆగడం లేదు. ఏ ఈవెంట్ కి వెళ్లినా అవార్డులు ఆర్ఆర్ఆర్ టీంకి దాసోహం అవుతున్నాయి. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ చిత్రం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేడుకలో ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్ కి రాజమౌళి, రాంచరణ్, కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ హాజరయ్యారు. రాంచరణ్ కి హెచ్ సి ఏ లో స్పాట్ లైట్ అవార్డు దక్కింది. 

హెచ్ సి ఏ వేడుకలో మొత్తం రాంచరణ్ హంగామా కనిపించింది. చరణ్ ఫోటోలు, వీడియోలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఒక వర్గం హెచ్ సి ఏ అవార్డ్స్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. హెచ్ సి ఏ సంస్థ ఎన్టీఆర్ ని గౌరవించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ హాజరు కాలేదు. రోజు రోజుకి ట్రోలింగ్ ఎక్కువ అవుతుండడంతో హెచ్ సి ఏ సంస్థ స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చింది. డియర్ ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్.. హెచ్ సి ఏ ఫిలిం అవార్డ్స్ కి హాజరు కావాలని మేము ఎన్టీఆర్ ని ఆహ్వానించాము. కానీ తన సినిమా షూటింగ్ పనుల వల్ల తారక్ హాజరు కాలేదు. త్వరలోనే తారక్ మా నుంచి అవార్డు అందుకుంటారు అంటూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. 

Scroll to load tweet…

తారకరత్న మరణించడం వల్లే ఎన్టీఆర్ హెచ్ సి ఏ ఈవెంట్ కి హాజరు కాలేదా అని ఓ నెటిజన్ ట్విట్టర్ లో ప్రశ్నించగా వారు రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్ ని తాము ముందే ఆహ్వానించాము అని.. సినిమా కార్యక్రమాల వల్ల హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన సోదరుడు మరణించడం జరిగింది అని క్లారిటీ ఇచ్చారు. 

ఏది ఏమైనా ఎన్టీఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం త్వరలో యుఎస్ వెళ్లనున్నారు. ఎన్టీఆర్ అమెరికా వెళ్ళినప్పుడు హెచ్ సీఏ అవార్డు అందుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ రాంచరణ్ అక్కడే ఉన్నాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ లో నిలిచింది. ఆస్కార్ అవార్డు కోసం చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలసి ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగననున్నారు.